భారతదేశం - సనాతన ధర్మం

 ఓం సహ నావవతు ! సహనౌ భునక్తు  ! సహవీర్యం కరవావహై !

తేజస్వి నావధీతమస్తూ మా విద్విషావహై !!


ఓం శాంతిః శాంతిః శాంతిః

గురు శిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించు గాక! ఇద్దరను పోషించు గాక ! ఇద్దరమూ ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాం గాక ! మన స్వాధ్యాయం ఎకాగ్రమూ ఫలవంతమూ అగుగాక ! ఎన్నాడూ మన మిద్దరమూ  పరస్పరం ద్వేషించుకోనకుందాం  గాక!

ప్రపంచ దేశాలలో గొప్ప దేశం మన భారత దేశం. దీనికి గల కారణం మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలూ, మన సాంప్రదాయాలు. దీనిలో భాగంగా గురువు శిష్యుల అనుబంధం, తల్లిదండ్రుల సేవే పరమార్ధం అని ప్రపంచానికి చాటిన ఘనత మన భారతీయులకే దక్కింది. శాంతి, ప్రేమ, సహనం అనేవి మన భారతీయులకు ప్రాణం.  ఏ దేశంలో లేనటువంటి గొప్ప సాంప్రదాయాలు, ఉన్నత విలువలు మన దేశంలో ఉన్న సనాతన ధర్మం మరియు ధార్మిక గ్రంథాల ద్వారానే వచ్చాయి. జీవితానికి కావలసిన ప్రతి చిన్న విషయాన్ని శృతి గ్రంధాలలో శాస్త్రాలుగా ఆజ్ఞాపించడం జరిగింది. వాటినే వేదాలు అంటారు. ప్రపంచంలోని అన్ని ధార్మిక గ్రంథాల కంటే వేదాలు అతి ప్రాచీనమైనవి. వైదిక పరిభాష అందరికి అర్ధం అయ్యే విధంగా వాటి సారాంశాన్ని ఇతిహాసాలుగా, పురాణాలుగా కధల రూపంలో వివరించడం జరిగింది. దీని వలన మనిషి ఇటు ఆధ్యత్మికం గాను అటు సామాజికం గాను ఎంతో అభివృద్ధి చెందాడు. వేద కాలం నుండి నేటి విజ్ఞాన శాస్త్ర కాలం వరకు మన దేశం మునుముందుకు సాగుతూనే ఉంది.  ఇటువంటి సనాతన ధార్మిక సంపద వలన విద్య మరియు శాస్త్ర -సాంస్కృతిక రంగాలలో మన దేశం అందరికీ ఆదర్శనీయం.

నేటి పరిస్థితి

ఒకప్పుడు కారు చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలుగు చూపిన భారత దేశం, నేడు అనేక మూఢ విశ్వాసాలలో, సామాజిక రుగ్మతలలో (అనైఖ్యత మరియు అనైతికత), దోపిడీ రాజికియాలలో మునిగి తేలుతుంది. స్వార్ధం, ఈర్ష్య, అసూయా, అసహనం వంటి చెడు గుణాలు నేటి సమాజానికి అలవాటవుతున్నాయి. సవితి తల్లి మాట కోసం అరణ్యాలకు వెళ్ళటం కాదు కదా, కన్నతల్లిని అనాధ ఆశ్రయాలకు పంపేవారు తయారవుతున్నారు.

          దీనికి గల ముఖ్య కారణం నేటి సమాజానికి కావలసిన ఉన్నత విలువలు, శాస్త్ర ఆజ్ఞలు తెలియకపోవటమే. కేవలం భౌతిక విద్యను ప్రాధాన్యత ఇచ్చి ధార్మిక విద్యను విస్మరించడం వల్ల ఆధునిక మనిషి చదువుకొని కూడా ఒక వింత పశువులాగా మారుతున్నాడు. నేటి తరానికి (యువతకు) సనాతన ధర్మ (వైదిక విద్య) విశిష్టిత తెలియకపోవడం వల్ల వారిలో పరిపూర్ణత, సుఖము మరియు మనశ్శాంతి కరువైంది.  దీనీనే గీత శాస్త్రం ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి పెట్టి తన ఇష్టము వచ్చునట్లు ప్రవర్తించునో, అట్టి వాడు పురుషార్ద సిద్ధిని గాని, సుఖమును గాని, ఉత్తమ గతి యగు మోక్షమును గాని పొంద నేరడు.” అని హెచ్చరిస్తుంది.          (గీత 16:23)

 ఉన్నత విలువలు మరియు నైతికతకు మూలం దైవభీతి. అలాంటి దైవం విషయాలలో శాస్త్రీయబద్దమైన (Scriptural) వైదిక ప్రమాణాలను విడిచిపెట్టి సాంప్రదాయంగా (Sentimental) మూఢ నమ్మకంతో గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. హిందూ సమాజంలో కొంతమంది సృష్టికర్త అయిన దేవుడు ఏకేశ్వరుడని అంటే, ఇంకొంతమంది దశావతారాలు అని, ద్వైతం అని, అద్వైతం అని, విశిష్టాద్వైతం అని పరస్పర విరుద్ద భావనలు కలిగి ఉన్నారు. మతానికో దేవుడుకులానికో దేవుడుదేశానికో దేవుడురాష్ట్రానికో దేవుడుజిల్లాకో దేవుడుప్రాంతానికో దేవుడు అనుకున్న కారణంగా రోజు రోజుకు దేవుళ్ళ సంఖ్య పెరిగి పోతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రతి మనిషి నిజదైవాన్ని గుర్తించలేక పోతున్నాడు. దీని వల్ల దేవుడు (GOD) అనే మూడు అక్షారాల పదం మీద కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంతే కాక అప్పుడుప్పుడు అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎవరు? అందరికి  దేవుడు ఒక్కడే ఉన్నాడా! లేక ఒక్కోక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడా? ఆతడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? అతనికి మనకి సంబంధం ఏమిటి? అతన్ని సాక్షాత్కారించుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించాలి? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

పరిష్కారం

          దీనికి గల ఏకైక పరిష్కారం మనం ఏదైతే సనాతన ధార్మిక విషయాలను విస్మరిస్తునామో దానిని తిరిగి స్థాపించడమే. మనం చేయదలచిన ప్రతి విషయాన్ని (Sentimental) సంప్రదాయబద్దంగా కాక శాస్త్రీయంగా (Scriptural) పరిశీలించి దాని తర్వాత ఆచరించాలి. ఎందుకంటే నీవు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించునప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలుసుకొని దాని ననుసరించి నీవీ ప్రపంచమున కర్మమును చేయదగును.” (గీత 16:24)అని గీత శాస్త్రం ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మన ధార్మిక గ్రంథాల జ్ఞానం కలిగి ఉండాలి.

ఇదే_విషయాలను  మనం బుద్దితో కాస్త ఆలోచిస్తే తయారు చేసేవాడు లేకుండా  వస్తువు ఉనికిలోకి రాదు కదా! మరి  భూమి, ఆకాశం, సూర్యుడ, చంద్రుడు ఇతర గ్రహాలు ఇవన్ని తాయారు చేసేవడెవ్వడు లేకుండానే ఉనికిలోకి ఎలా వచ్చాయింటారు? అలాగే ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే దానిని నడిపించేవాడు ఒక్కడే అయి ఉండాలిమరి  విశ్వవ్యవస్ధ ఇంత సక్రమంగా నడుస్తుందంటే దీనిని నడిపించేవాడు కుడా ఒక్కడే అయి ఉంటాడు. ఒకవేళ  నడిపించేవాడు ఒక్కడు కాకుండా ఇద్దరు లేక అనేకులు ఉంటే ఒకరు వర్షం కురవాలని శాసిస్తే మరొకరు ఎండ రావాలని ఆజ్ఞపిస్తారు. సూర్యుడు తుర్పు నుంచి ఉదయించాలని ఒకరు Order వేస్తే లేదు పడమర నుండి అని మరోకరు వాదిస్తారుకాబట్టి ఒక్క దేవుడు కాక అనేక మంది దేవుళ్ళు ఉండి ఉంటే  విశ్వవ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోతుంది. దీనినే మన ధార్మిక గ్రంథాలు కుడా ధృవపరుస్తున్నాయి.

దేవుడు ఒక్కడే !!

ద్వావా భూమీ జనయాన్ దేవ ఏక‍ః                                                 (శ్వేతశ్వేతరోపనిషత్ 3:3)

ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు ఒక్కడే.

అహం సర్వస్య ప్రభవో మత్తఃసర్వం ప్రవర్తతే!                                              (గీత 10:8)

నేనే ఈ సమస్త సృష్టికి ఉత్పత్తి కారనమైనవాడను. నా వలననే ఈ సమస్తమూ నడుచుచున్నది.                    

న ద్వితియో న తృతీయశ్చతుర్దో నాప్యుచ్యతే

న పంచమో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే

న అష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే

తమిదం నిగతం సహః స ఏష ఏక ఏక వృద్ ఏక ఏవ

సర్వే అస్మిన్ దేవ ఏక వృతో భవంతి

సర్వేశ్వరుడు ఒక్కడే! ఆయనకు సమానులుగా చేయడానికి రెండోవాడు గాని, మూడోవాడు గాని, నాల్గోవాడు గాని లేడు. ఐదోవ, ఆరోవ, ఏడోవ వాడు లేడు. ఎనిమిదొవ వాడు గాని, తోమ్మిదొవ వాడు గాని, పదోవ వాడు గాని లేడు. ఆయన ఒక్కడే ; ఒకే ఒక్కడై ఉన్నాడు.                      (అధర్వేదం 13:4:16-21)

 

ఇలా మన ధార్మిక గ్రంధాలన్నీ, ఎవరైతే ఈ భూమ్యాకాశాలను, సుర్యాచంద్రులను సృష్టించి మనుషులందరినీ పుట్టించాడో ఆయనే దేవుడు అని అంటున్నాయి. మరియు ఆ ఒక్క దేవుడే వీటన్నిటిని సక్రమంగా పరిపాలిస్తున్నాడు అని బొధిస్తున్నాయి. ఆ ఒక్క దేవుడినే భగవద్గీత పరిభాషలో సర్వేశ్వరుడు అనిబైబిల్ పరిభాషలో యెహోవా అనిఖుర్ఆన్ పరిభాషలో అల్లాహ్ అని అన్నారుభాష మారినంత మాత్రాన ఆ దేవుని అస్తిత్వం మారలేదుఎలాగంటే హిందువులు నీరు అన్నాక్రైస్తవులు వాటర్ (Water) అన్నాముస్లింలు పాని అన్నా భావం ఒక్కటేభాష మారినంత మాత్రాన నీటి గుణము మారలేదు కదాదీనినే వేదాల్లో

ఏకం సత్విప్రా బహుధా వదంతి

దేవుడు ఒక్కడేపండితులు ఆయనను అనేక పేర్లతో పిలుస్తారుఅని అనడం జరిగిందిభగవద్గీతబైబిల్మరియు ఖుర్ఆన్ లో వేరు వేరు దేవుళ్ళు లేరుఆ ఒక్క దేవుడే అనేక భాషల్లో పరిచయం అయ్యాడు. అంతేకాక ఆ ఒక్క దేవుడినే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే గుణవాచకాలతో పిలవడం జరిగింది. కాని నేడు అనేక మంది ఆ ఒక్క దేవుడి లక్షణాలు తెలియక ఆయనే దశావతారాలుగా అవతరించాడని అపోహ పడుతున్నారు. కాని ఈ విషయం గూర్చి గీత శాస్త్రం ఇలా తెలియజేస్తుంది.

“నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు, ప్రకృతికే పరమై విలసిల్లునట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందినవానిగా తలంచుచున్నారు.” (గీత 7:24)

అంటే కేవలం అవివేకులు మాత్రమే దేవుడు మానవుడిగా అవతరించాడు అని అనుకుంటారు, యదార్ధం ఏమిటంటే దేవుడు అవ్యక్తుడు మరియు అవతరించేవాడు కాదు అని తెలియజేస్తుంది. మరి ఈ ప్రపంచంలో ఎప్పుడెప్పుడయితే ధర్మం నశించి పోతుందో ప్రజలకు ధర్మాన్ని నేర్పించటానికి అధర్మాన్ని తొలగించటానికి దేవుడు అనేక కాలాల్లో అనేక ప్రాంతాల్లో చాలా మంది ప్రవక్తలను, ఋషులను, మహనీయులను పంపించాడు. ఈ మహనీయులు అందరు కూడా ఆ ఏకేశ్వరుణ్ణి పరిచయం చేసి ఆయన్నే ఆరాధించమని సందేశం ఇచ్చారు.

మహనీయులు ఇచ్చిన సందేశం

శ్రీ కృష్ణుల వారు: 

తమేవ శరణం గఛ్చ                సర్వ భావేన భారత

                 తత్ప్ర సాధాత్పరాం శాంతిం       స్ధానం ప్రాప్స్యసి శాశ్వతమ్   (గీత 18:62)


      ఓ అర్జున! నీవు సర్వవిధముల ఆ ఈశ్వరునే శరణుపొందుము. ఆయన అనుగ్రహముచే

 నీవు సర్వోత్తమ శాంతిని, శాశ్వతమగు మోక్షపదవిని పొందగలవు.            

                          

శ్రీ రాముల వారు:            కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే

ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవ మన్హికం

          కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా రామా! సూర్యోదయానికి వేళ అవుతుంది లే.

 లేచి ఆ దైవానికి ఆరాధించటం నీ కర్తవ్యం... అని విశ్వామిత్రుల వారు శ్రీ రాముల వారిని

 నిద్ర లేపుతున్నారు.         (రామాయణం బాలకాండం)



శ్రీ సాయి బాబా వారు :  అనుక్షణం ఇలా ఉపదేశించేవారు

“ సబ్ కా మాలిక్ ఏక్ హై ”         “అందరికీ దేవుడు ఒక్కడే..!”

అంతేకాక వారు ఎప్పుడు కూడా “మేము దైవాలము మమ్మాల్ని ఆరాధించండి” అని ప్రకటించలేదు. వారు తమ గురించి తాము ఇలా పరిచయం చేసుకున్నారు.

శ్రీ కృష్ణుల వారు:                                     కృష్ణం వందే జగద్గురుమ్                  (గీత శాస్త్రం)

శ్రీ కృష్ణుల వారు జగత్తుకు గురువు.

శ్రీ రాముల వారు:                       నేను దశరధ మహారాజు కుమారుణ్ణి. అయోధ్యకు రాజును.

శ్రీ సాయి బాబా వారు:                                   బాబా ఒక సద్గురువు.         (శ్రీ సాయి లీలామృతం)

 అంటే శ్రీ రాముల వారు, శ్రీ కృష్ణుల వారు, శ్రీ సాయి బాబా వారు (వీరిని దైవాలుగా కాక)  గురువులుగా భావించి వీరిచ్చిన సందేశం ప్రకారం ఆ ఏకైక దైవాన్ని ఆరాధించాలి, ప్రార్ధించాలి. అప్పుడు మాత్రమే మనం చేసే పూజలు, వ్రతాలు, ఆరాధనలు సఫలం అవుతాయి. మనకు ఇహలోకంలో శాంతి మరియు పరలోకంలో మోక్షం లభిస్తాయి. అలాకాకుండా ఆ నిజ  దేవుణ్ణి విడిచి మహనీయులను గాని, ఇతరులను గాని ఆరాధిస్తే అటువంటి వారి పూజలు వ్యర్ధమైపోతాయి, మనశ్శాంతి కరువవుతుంది మరియు వారు అంధకారంలో (నరకంలో) ప్రవేశిస్తారు అని మన ధార్మిక గ్రంథాలు హెచ్చారిస్తున్నాయి.

 దేవుణ్ణి వదిలి ఇతరులను ఆరాధిస్తే !

అంతవత్తు ఫలం తేషాం    (గీత 7:23)

దేవుణ్ణి విడిచి ఇతరులను ఆరాధించే వారి ఫలము నాశానవంతమైనది.

అంథః తమ ప్రవిషన్తియే అసంభుతి ముపాసతే

                 తతోభూయ ఇవతెతమోయాఊ సంబుత్యాగ్రతః  (యజుర్వేదం 40:9)

ఎవరైతే ప్రాకృతిక వస్తువులను (గాలి, నీరు, మొదలగు వాటిని) పూజిస్తారో వారు అంధకారం (నరకం) లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభుతి (సృష్టితాలు మానవునిచేత తయారయ్యే వస్తువులు, బొమ్మలు) ని పూజిస్తారో వారు మరింత అంధకారం (నరకం) లో ప్రవేశిస్తారు.

ఈ కరపత్రం ద్వారా మనకు స్పష్టమైన విషయాలు ఏమిటంటే “ఈ సమస్త సృష్టిని సృష్టించినవాడే దేవుడు. ఆయన ఒక్కడే ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు.  ఆయనను పరిచయం చేయడానికి వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో మహనీయులను, ఋషులను, ప్రవక్తలను పంపించాడు. ఆ మహనీయులను గురువులుగా భావించి వారు చెప్పిన విధంగా ఆ ఏకేశ్వరుణ్ణి మాత్రమే పూజించాలి. ఎవరైతే ఆ ఏకేశ్వరుణ్ణి యదార్ధంగా తెలుసుకొని ఆయనను మాత్రమే ఆరాధిస్తారో అలాంటి వారికి యోగక్షేమాలు, సిరి సంపదలు, మనశ్శాంతి మరియు పరలోకంలో మోక్షం లభిస్తాయని మన ధార్మిక గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి.

మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరు పైన చెప్పబడిన విషయాలను పరిశీలించి ఆచరించాలి అలాగే తప్పనిసరిగా ధార్మిక గ్రంథాల సందేశాన్ని చదివి ఇతరుల దాకా చేరవేయాలి. అప్పుడు మాత్రమే కనుమరుగవుతున్న మన భారత దేశ విలువలను, సాంప్రదాయాలను కాపాడవచ్చు.

జై హింద్..!

 


No comments:

Post a Comment