1. విశ్వానికి సృష్టికర్త అక్షర పరబ్రహ్మ
విశ్వానికి
సృష్టికర్త అక్షర పరబ్రహ్మ
బ్రహ్మ ఎవరో
తెలియకుంటే వ్యర్థమవును జన్మ
అమ్మలో ఉండేటి
లక్షణం ఆయనే
నాన్నలో ఉండేటి
శిక్షణ ఆయనే
బ్రహ్మే లేకుంటే
జన్మే లేదురా
పరబ్రహ్మే లేకుంటే
నీ జన్మే లేదురా
-విశ్వానికి...
విశ్వాన్ని అందంగా సృష్టించినవాడు
మనిషిని
ఉన్నతంగా సృజియించినవాడు
-బ్రహ్మే
లేకుంటే...
ప్రకృతిని ఆధీనం
చేసినవాడు
నిత్యజీవ
మార్గాన్ని చూపించినవాడు
-బ్రహ్మే
లేకుంటే...
ఆకర్షణ హంగామా
ప్రపంచిక జీవితం
కాదిది శాశ్వతం
ఇహలోకపు ఆనందం
కోరే కోరిక తీరే
నిజ జీవి
తంలో
-బ్రహ్మే
లేకుంటే...
ఒక్కడైనా ఆయన్నే
తెలుసుకొనుట సత్యము
లేదుకదా జననము మరి
లేదుకదా మరణము
జన్మించేవారెవరూ
బ్రహ్మే కాదురా
-బ్రహ్మే
లేకుంటే...
2. నిరాశను వదులుకో
నిరాశను వదులుకో
విశ్వాసమును పెంచుకో
నీవు
నమ్ముకున్నవాడు నమ్మదగినవాడు మనసా
నీవు ఆశపెంచుకున్న
దేవుడు సర్వశక్తుడే మనసా
కనులు మూతపడేవరకు, కరములెత్తుట మరువకు
-నిరాశను...
ఆనాడు తనవారికై
ఆ... ఆ...
ఆనాడు తన వారికై
సముద్రాన్ని చీల్చినోడు
నీ దేవుడే మనసా
ఈనాడు మీకోసమే
సర్వసృష్టిని
శాసించగలడు విశ్వసించుమా
-నిరాశను...
ఆనాడు తన దాసునికై
ఆ... ఆ...
ఆనాడు తన దాసునికై
అగ్నిగుండాన్ని మార్చేసినోడు
నీదేవుడే మనసా
ఈనాడు మీ కోసమే
ఈనాడు మీకోసమే తన
కారుణ్యాన్ని గాలిగా మార్చి
నీ పైకి పంపించగలడు
విశ్వసించుమా
-నిరాశను...
ఆనాడు
నిరక్షరాస్యునిపై ఆ... ఆ
ఆనాడు
నిరక్షరాస్యునిపై దివ్యగ్రంథాన్ని పంపినోడు
నీదేవుడే మనసా
ఈనాడు మీకోసమే
ఈనాడు మీకోసమే
సాఫల్య మార్గాన నడిపించి
స్వర్గాన్ని
ఇచ్చేయగలదు విశ్వసించుమా
-నిరాశను...
3. ఓ విధాతా
ఓ విధాతా
విశ్వకర్తా, తీర్పుదినపు న్యాయకర్త
మొరలు విని మము
కావుమయ్యా
కరకు లెక్కలు
తీయకయ్యా.
-ఓ విధాతా...
సర్వవ్యాపిత శక్తి
నీది, తలనువంచే భక్తిమాది
కరుణ మాపై చూపవయ్యా, కంటి అరుణిమ చూపకయ్యా
-ఓ విధాతా...
ఆదిలేని అంతము లేని, సాటి అసలు లేనెలేని
నీదులీలా
సర్వసృష్టి, నిను స్తుతించే జీవకోటి
-ఓ విధాతా...
చెంపతడిపే అశ్చ
ఉప్పెన దయనుకోరే హృదయవేదన
తప్పు తెలిసిన
మనసురోదన, ఎదను తొలిచే ఆత్మఘోషణ
-ఓ విధాతా...
చపలచిత్తపు
తప్పులెన్నో నివురుగప్పిన నిప్పులెన్నో
ఉగ్రూపం ఊహకొస్తే, కంట ఉబికే ఊటలెన్నో
-ఓ విధాతా...
మేము చేసిన సమయ
హరణం, చేత మిగిలెను విఫల జననం
తిరిగిరాదు కాలగమనం, నీదు శరణే మాకు శమనం
-ఓ విధాతా...
4. కలలాంటి
కలలాంటి జీవితానికి
కాలమే సాక్షి
కలత చెందిన
హృదయానికి సహనమే సాక్షి
భ్రమించే
జీవితానికి వాస్తవాలే సాక్షి
చేసిన కర్మలకు
ఇంద్రియాలే సాక్షి
గ్రహిస్తే
జ్ఞానివిరా
విశ్వసిస్తే
మోక్షమురా
-కలలాంటి...
క్రమశిక్షణకై
సూర్యచంద్రులే సాక్షి
శాస్త్రీయతకై
విశ్వవ్యవస్తే సాక్షి
వికసించే
జీవితానికి ఉషోదయమే సాక్షి
అంతమయ్యే
జీవితానికి సంధ్యా చీకటే సాక్షి
గ్రహిస్తే జ్ఞానివిరా
విశ్వసిస్తే
మోక్షమురా
-కలలాంటి...
సర్వానికి
సృష్టికర్త సర్వేశ్వరుడు
పుట్టుకే లేని
పురుషోత్తముడు
మృత్యువేలేని
అమృతామయుడు
అవ్యక్తుడు
అణువుకన్నా సూక్షమమైన వాడు
గ్రహిస్తే
జ్ఞానివిరా
విశ్వసిస్తే
మోక్షమురా
-కలలాంటి...
5. కరుణా సంకేతం
ఉదయించే ప్రతికిరణం
నీ సందేశం
ఎగసిపడే ప్రతికెరటం
నీ కరుణా సంకేతం
ఎగిరేపక్షులు సైతం
నిన్నే ఆరాధించేను
జ్ఞానమున్న మానవుడు
భ్రమలో మునిగేను
-ఉదయించే...
తేనెటీగ చూపి నీవు
గుణపాఠం నేర్పావు
భూదిగాంతవాసులను
మేల్కొలిపావు
మేల్కొలిపావు
-ఉదయించే...
హృదయాలను శోధించే
ఏకైక దేవుడవయ్యా
పరమునందు ఉన్నవాడ
సాటి నీకు ఎవరయ్యా
సాటి నీకు ఎవరయ్యా
-ఉదయించే...
వెలుగు చీకటి ఒకటి
కాదు నిన్ను పోలినవాడు లేడు
ఆత్మతోనే ఆరాధించే
అవ్యక్త రూపుడవు నీవు
అవ్యక్త రూపుడవు
నీవు
-ఉదయించే...
6. ఓ విధాతా కృపాసాగరా
ఓ విధాతా కృపాసాగరా
నిర్వికారా నిరాకారుడా
మమ్ము కరుణించుమా
మమ్ము కాపాడుమా
సత్యమార్థాన
నడిపించుమా
-ఓ
విధాతా...
మారు మోగేటి హింసా
నినాదం కోర చాచేటి దౌర్జన్యవాదం
రాగద్వేషాలతో
బేధభావాలతో మానవత్వంబు మటుమాయ మాయె
సర్వలోకాల పరిపోషకా
సృష్టికర్త సృజనకారుడా
శాంతి స్థాపించుమా
సౌఖ్యమందించుమా
మా కష్టాలు
తొలగించుమా
-ఓ
విధాతా...
మా హృదయాలు
బలహీనమాయె పలుపాపాలతో నిండిపోయే
మమ్ము మన్నింపుమా
మమ్ము కరుణింపుమా మీ దయను కలిగించుమా
ఓ మహమార్గ
నిర్దేశకా మహజీవ పరిపోషకా
ఇహలోకంబులో పరలోకమ్ములో
సాఫల్యాన్ని అందించుమా
-ఓ
విధాతా...
7. నీటి బుడగ వంటిది ఈ బ్రతుకు
నీటి బుడగవంటిది ఈ
బ్రతుకు ఓ నరుడా
ఏ క్షణాన అంతమవునో
తెలియదు ఓ నరుడా
రంగులతో
మురిపించేను మాయా ప్రపంచం
క్షణాలలో
మరిపించేను ఈ అనిత్య ప్రపంచం
-నీటి
బుడగవంటిది...
మహరాజులైనా
నిరుపేదలైనా
మన్నులోన
మన్నెపోయారే
ధిక్కరించి చిత్తయి
పోయారే ఓ నరుడా
శాశ్వతం కాదు ఈ
లోకం అనిత్యమైనదిలే
-నీటి
బుడగవంటిది...
జీవితానికి ఇవతల
ఇహము, జీవితానికి అవతల పరము
నట్టనడుమ వారధియే
మరణము ప్రపంచమే పరీక్షా స్థలము
జీవితం పరీక్షా
సమయం దైవమే నిర్వహకుడు
ఆ సృష్టికర్తనే
విశ్వసించుమా...
-నీటి
బుడగవంటిది...
కోరికలకు దాసుడవై
సత్యమార్గ భ్రష్టుడవై
నరకానికి చేరువ
కాబోకు
పాపకార్యాలతో కర్మల
పత్రం నింపివేసి
దైవము ఎదుట అయ్యో
అనకోయి నరుడా
అంతిమ దినం ఉన్నది
లెక్క చెప్పుకోవలెనోయి ప్రతి చర్యకు
-నీటి
బుడగవంటిది...
8. ఏకైక దేవుడు
అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు
ఆ దేవుడు, ఏకైక దేవుడు
అల్లాహ్ ఈశ్వరా
యెహోవా
-అనంతకరుణామయుడు...
పుట్టుకలేనివాడు
మరణములేని వాడు
ప్రకృతికి పరమై
విలసిల్లినవాడు
ఆ దేవుడు ఏకైక
దేవుడు
అల్లాహ్ ఈశ్వరా
యెహోవా
-అనంతకరుణామయుడు...
సర్వోత్తముడు, అవ్యక్త రూపుడు
పాంచభౌతిక దేహము
ధరియింపని వాడు
ఆ దేవుడు ఏకైక
దేవుడు
అల్లాహ్ ఈశ్వరా
యెహోవా
-అనంతకరుణామయుడు...
సర్వజ్ఞుండు
పురాణపురుషుండు
అణువుకంటే మిగుల
సూక్ష్మమైనవాడు
ఆ దేవుడు, ఏకైక దేవుడు
అల్లాహ్ ఈశ్వరా
యెహోవా
-అనంతకరుణామయుడు...
అచింత్య రూపుడు, పురుషోత్తముడు
సకల ప్రపంచమునకు
ఆధారభూతుడు
ఆ దేవుడు, ఏకైక దేవుడు
అల్లాహ్ ఈశ్వరా
యెహోవా
-అనంతకరుణామయుడు...
9. ఒకడే దేవుడు ఒకడే కర్త, సృష్టికొకడే యజమాని
ఒకడే దేవుడు ఒకడే
కర్త, సృష్టికొకడే
యజమాని
ఒకటే ధర్మం ఒకటే
మార్గం, తెలుసుకో ఇది సత్యమని
-ఒకడే
దేవుడు...
దైవసృష్టిలో
శ్రేష్టుడవు నీవేరా ఓ మానవుడా?
యోచించే ఆలోచన చేసే
జ్ఞానమొసగినది నీకేరా!
విజ్ఞానమొసగినది
నీకేరా
-ఒకడే
దేవుడు...
ఉన్నత చదువులు
ఎన్ని చదివినను ఫలితముందోదురా
సృష్టికర్తను గ్రహించలేని
దిగ్రీలన్నీ వ్యర్ధమురా
నీ డిగ్రీలన్నీ
వ్యర్థమురా
-ఒకడే
దేవుడు...
ఈ జీవితమే
శాశ్వతమని భ్రమలో పడిపోబోకురా
మృత్యువుతో అది
అంతమగుననే విషయం విస్మరించకురా
ఈ పరమసత్యమునే
గ్రహించరా
-ఒకడే
దేవుడు...
ఇహమున నీవు సాధించిన
స్థిరమెన్నడు కాదురా విజయం
పరమును దైవ దర్శనభాగ్యం
కలుగుటయే నిజ సాఫల్యం
నీకు కలుగుటయే నిజ
సాఫల్యం
-ఒకడే
దేవుడు...
దేవుడొక్కడని విశ్వసించిన
జీవితమగును శాంతిమయం
దైవదాస్యము
చేసిననాడే కలుగును ఇహపర సాఫల్యం
నీకు కలుగును ఇహపర
సాఫల్యం
-ఒకడే
దేవుడు...
మనిషి పుట్టినది
మొదలుకొని ప్రవక్తలిచ్చినదీ సందేశం
దేవుడు పంపిన ప్రతి
గ్రంథం ఇస్తూంది ఈ సందేశం
ఇది గ్రంథాలిచ్చే సందేశం
ఇది శాస్త్రాలిచ్చే సందేశం
ఇదియే సత్య సందేశం
-ఒకడే
దేవుడు...
10. తెలుసుకో ఈ జీవిత సత్యం
తెలుసుకో ఈ జీవిత
సత్యం
మరువకూ నీ జీవిత లక్ష్యం
జ్ఞానమున్న ఓ మనిషి
చేరుకో నీ జీవిత
గమ్యం
-తెలుసుకో...
ఒకరిని మించి మరి
ఒకరు
ప్రపంచాన్ని
పొందాలనీ
రంగుల హంగుల ఆనందం
సదా అనుభవించాలనీ
కోరే ఓ మనిషి
-తెలుసుకో...
ఊహలు భ్రమలు
ఆవరింపగా
కలలు హరివిల్లయి
నిర్మింపగా
వృధా పోయెను
విలువైన కాలం
ముగిసిపోయేను జీవిత
ప్రయాణం
-తెలుసుకో...
తోడురారు బంధువులు
మరణం వచ్చాకా
వెంటరావు సంపదలు
ఊపిరి ఆగాకా
తెగిపోతాయి బంధాలు
శ్వాస ఆగిపోతే
జారిపోతుంది సర్వం
మృత్యువు వచ్చేస్తే
-తెలుసుకో...
మనసులోని భావన
సౌఖ్యం పొందాలనీ
అంతరాత్మ అభిలాషా
అది శాశ్వతం అవ్వాలనీ
గుర్తించు నిన్ను
సృష్టించిన అక్షర పరబ్రహ్మను
అనుసరించు ఆయన
పంపిన గ్రంథాలను
-తెలుసుకో...
11. జీవన గమనం
జీవన గమనం ఇదే ఓ
మానవా
నీ జీవిత గమ్యం ఇదే
ఓ మానవా
సృష్టిని సవ్యంగా
నడిపించే
దైవం ఎవరో తెలుసుకో
సమస్త శుభాలను
ప్రసాదించిన
ఆ సర్వేశ్వరుని
తెలుసుకో
-జీవన
గమనం...
మాత్రు గర్భాలలో మనలను
సృజించినవాడు
సమస్త జీవరాసులను
సృష్టించినవాడు
జానేంద్రియాలను
ప్రసాదించినవాడు
జ్ఞానానిచ్చి, గ్రంథాలిచ్చి
సన్మార్గం చూపిన
ఆ సర్వేశ్వరుని
తెలుసుకో
-జీవన
గమనం...
ఆయనే ప్రకృతిని
ఆధీనం చేసినవాడు
ఆయనే జనన మరణాలకు
అతీతుడు
ఆయనే
పంచేంద్రియాలకు అగోచరుడు
ఆయనే ఆయనే
సర్వసృష్టికి ఆధారభూతుడు
సర్వేశ్వరుని
తెలుసుకో
-జీవన
గమనం...
కాదురా శాశ్వతం ఈ
జీవితం
ఉందిరా వేరొకటి
నిత్యజీవితం
పొందరా స్వర్గము
అది నిజసాఫల్యం
దొరకురా పరబ్రహ్మ
పదసానిధ్యం
-జీవన
గమనం...
12. తెలుసుకో
ఈ బ్రహ్మజ్ఞానం
మానవుడా!
వివేకమున్న సోదరా
తెలుసుకో ఈ బ్రహ్మజ్ఞానం, తెలుసుకో నీ జీవిత లక్ష్యం
తెలుసుకో ఈ జ్ఞానం, తెలుసుకో ఈ సత్యం
-తెలుసుకో...
విద్యలలోకెల్లా
శ్రేష్టమైనది
రహస్యములలో అతి
రహస్యమైనది
సర్వోత్పష్టమైనది
అతి పవిత్రమైనది, పరిశుద్ధమైనది
ఈ బ్రహ్మ జ్ఞానం
-తెలుసుకో...
ప్రత్యక్షముగా
తెలియదగినది
అనుష్టించుటకు
మిగుల సులభమైనది
ధర్మయుక్తమైనది
నాశరహితమైనది, ఉత్తమోత్తమమైనది
ఈ బ్రహ్మజ్ఞానం
-తెలుసుకో...
అవ్యక్తమైన
పుట్టుకలేని
జన్మరహితమైన ఆ
ఈశ్వరుని
తెలియదగినది
అజ్ఞానాంధకారపు ఆవల
ఉండేది
సర్వపాపములనుండి
విడిపించేది
ఈ బ్రహ్మజ్ఞానం
-తెలుసుకో...
13. భాషలు
వేరైనా దేవుడు ఒక్కడే
యా అల్లాహ్, యెహోవా, ఈశ్వరా!
భాషలు వేరైనా
స్వామి ఏకైక దేవుడవయ్యా
పుట్టుకంటు లేనివాడ, పుడమిపైన ఉండని వాడ
నిత్యుడైన
దేవుడవయ్య, నిరతము నిను కొలిచెదమయ్యా
-యాఅల్లాహ్...
నింగివేరు నేలవేరు, నింగిలోని తారలు వేరు
గాలినేరు నీరువేరు, సాగరాన జీవులు వేరు
వేరువేరైనగానీ
ఒక్కడైన నిన్నే కొలిచే
ఒక్కటైన మానవజాతి
నువ్వు ఒక్కడన్న భావం మరిచే
-యాఅల్లాహ్...
సాగరాన జలములు
కొన్ని మబ్బులుగా నింగినిచేరె
నింగిలోని
కాంతులన్నీ భూమిపైన చీకటితోలె
భాషలేని బంధం
తెలిపే మన సృష్టికర్త ఒకడే ననుచు
జ్ఞానమున్న
మానవులంతా నువ్వొక్కడన్న భావం మరిచే
-యాఅల్లాహ్...
హిందువైన, ముస్లిమైన, యూదులైన క్రైస్తవులైనా
బౌద్ధులైన జైనులైన
సిక్కులైన వేరెవరైనా
ఒకే జంట సంతానమనీ, మీరంతా సోదరులనుచు
నేనే మీ దేవుడననుచు, నాకు సాటి లేరన్నావు
-యాఅల్లాహ్...
14. అన్వేషకుడా!
అన్వేషకుడా, నిత్య
అన్వేషకుడా
సృష్టి తెలిపే సత్యమేదో
వెతికి చూడు
-అన్వేషకుడా...
రేయి చూడు పగలు
చూడు
బ్రతుకు చీకటిలో
వెలుగు చూడు
వెలుగు, వెలుగుకు
వెలుగునిచ్చే
సృష్టికర్తను
గ్రహించి చూడు
-అన్వేషకుడా...
వికసించే
ప్రతిపుష్పం వెదజల్లే
పరిమళం గ్రహించి
చూడు
పరవశించే ప్రకృతిలో
తలలు వంచె నీడను
చూడు
-అన్వేషకుడా...
మునిగిపోయె
ఉప్పెనలో
అంతరంగం పిలుపు
చూడు
అలలు మధ్య
మొరలువిని
దరిని చేర్చి
దేవుని కరుణను చూడు
-అన్వేషకుడా...
గగనానికి శోభనిచ్చె
తారలలో
దైవశాంతిని చూడు
గర్జించె పిడుగు
మెరుపులో
దేవుని ఉగ్రతను
గమనించి చూడు
-అన్వేషకుడా...
హృదయంలో గూడు కట్టే
ఊహలను విడిచిచూడు
చీకటిలో మార్గముచూ పె
మార్గజ్యోతిని
పొంది చూడు
-అన్వేషకుడా...
15. అంతిమ పయనమెటు
వినరా సోదరా వినుమా
సోదరీ
అంతిమ పయనమెటో
ఆలకించరా
-వినరా...
మూడునాళ్ల
జీవితానికి ఎందుకింత ఆత్రుతరా
తోడురాని సంపాదనకై
ఎగసిపాటు ఏలరా
నీ ఎగసిపాటు ఏలరా!
-వినరా...
కాలేజీలు, కంప్యూటర్లు ఇంటర్నెట్టులే కాదురా
నింగికి నీవు ఎంత
కెగసినా నేల కరువకా తప్పదురా
నీవు నేల కరువక
తప్పదురా!
-వినరా...
ఆదమరచి నువు ముందుకేగితే
అంధకారమే మిగులునురా
మానవ ధర్మం మరువకుంటే
స్వర్గము నీకై ఉండునురా
ఆ స్వర్గము నీకై
ఉండునురా!
-వినరా...
స్వల్పమైన నీ జీవితకాలం
విలువైనదని మరువకురా
అంతిమగమ్యం చేరే
వరకు సన్మార్గమునేవిడువకురా
ఆ సన్మార్గమునే
విడువకురా!
-వినరా...
భ్రమల ప్రపంచపు
స్థితి గమనం ముగింపు తెలియని దుస్థితిరా
ప్రభవించిన
గ్రంథాలవెలుగులో మార్గ నీకై స్పష్టమురా
సన్మార్గము నీకై
స్పష్టమురా!
-వినరా...
16. ఉండిపోదు
జీవితం
ఉండిపోదు జీవితం
ఇలాగెప్పుడు
ఉండదని ఊడునని నిజం
నమ్ముము
-ఉండిపోదు...
దండిగా ధనముండినా
ఒక బండితో
వెండుండినా
పండినా భూముండినా
నీ కండ్లు మూతబడును
-ఉండిపోదు...
కట్టినా మేడుండినా
పది కొట్లతో
పసిడుండినా
గట్టిగా బలముండినా
నీ కట్టె కాటికవును
-ఉండిపోదు...
అందమే నీకుండినా
అతి అందమైన
ఆలుండినా
బంధువులు వేలుండినా
నీ బొంది బూడిదగును
-ఉండిపోదు...
తెలుసుకో ఓ మానవా
క్షణ భంగురం నీ
జీవితం
దైవమూ ఒకడేనని
దైవమ్మునే
స్మరియించాలని
తెలిసి మసలుకొనుమా
-ఉండిపోదు...
17. ఆ
ఈశ్వరుని ప్రేమ పొందగా
ఆ ఈశ్వరుని ప్రేమ
పొందగా
సమయమిదియేను ఓ
సోదరా!
కన్నీటితో అడుగు ఆ
కరుణామూర్తిని
క్షమియించి బోవమని
ఆ దయా సాగరుని
జగమేలు స్వామిని ఆ
జీవనాధుని
-ఆ ఈశ్వరుని...
భ్రమల యెడ భ్రాంతి
కలిగి జీవించితి
నీడనే తోడుగా
భావించితి
భ్రమలు నిజము కావనీ
నీడ నిలువలేదనీ
తెలిసిందిలే ప్రభూ
తెలిసిందిలే
పిలించిందిలే మనసు
నిన్ను పిలిచిందిలే
-ఆ ఈశ్వరుని...
సముద్రాన పయనమని నే
మరచితి
కష్టాలకు భయపడి
నిను విస్మరించితి
సముద్రాన పయనంలో
సుడులు రాక మానవని
అలలు ఆగబోవని
తెలిసిందిలే ప్రభూ
తెలిసిందిలే
పిలించిందిలే మనసు
నిన్ను పిలిచిందిలే
-ఆ ఈశ్వరుని...
18. జనన
మరణాలకు అతీతుడు
జనన మరణాలకతీతుడు
జనులకగోచరుడు, అవ్యక్తుడూ
అతడే అక్షర
పరబ్రహ్మా... అతడే యెహోవా...
అతడే అతడే అతడే
అల్లాహ్
తెలుగులో నీరు అన్న
ఆంగ్లంలో వాటర్ అన్న
ఉర్దూలో పాని అన్న
భావమొక్కటే
భాష మారితే నీటి
గుణము మారునా, పేరు పేరునా దైవంబు వేరునా
హైందవులు ఈశ్వర్
అన్న క్రైస్తవులు యెహోవన్న ముస్లింలు అల్లా
అన్నా దేవుడొక్కడే
మన దేవుడొక్కడే..
తెల్లనైన ఎర్రనైన
నల్లనైన మబ్బులు
కలసి కురిసినప్పుడు
నీటిరంగు ఒక్కటే
తెల్లనైన ఎర్రనైన
నల్లనైన గోవులు
పాడి పితికి
నప్పుడు పాల రంగు ఒక్కటే
మబ్బు మారితే నీటి
రంగు మారునా
గోవు గోవుకు పాల
రంగు వేరునా
-హైందవులు...
పులుపు తీసి వగరు
పళ్లు పుట్టించే పుడమి ఒకటే
పసుపు ఎరుపు తెలుపు
పూలు పూయించే భూమి ఒకటే
పళ్లు పూలు వేరైనా
భూసారం ఒక్కటే
గీత బైబిల్ ఖురాన్ల
సందేశం ఒక్కటే...
-హైందవులు...
ఉదయాలు వేరైనా
ఉదయబానుడొక్కడే
హృదయాలు వేరైనా
భక్తి భావం ఒక్కటే
మతాలన్ని చాటేటి
మానవతా ఒక్కటే
సర్వసృష్టికి కర్త
ఒక్కడే సృష్టికర్త ఒక్కడే...
-హైందవులు...
19. బయలు దేరింది
బయలుదేరింది
పరలోకము
ఎదురు వెళ్తుంది
ఇహలోకము
ముగిసిపోవునురా ఈ
జీవితం
ఒక మాయతడిక కాదా ఈ
లోకము
-బయలుదేరింది...
ప్రపంచాన్ని ఏలినా
పిడికెడు మనసుకు
దాసుడు
వెంటరాని పంటరా
ఎండమావి కాదా
ఎండమావి కాదా
-బయలుదేరింది...
సుడిగాలిలో నావవలె
గమ్యం తెలియని
జీవులెందరో
ముక్తికి మార్గం
నీవయ్యా
నీకు సాటి ఎవరయ్యా?
నీకు సాటి ఎవరయ్యా
-బయలుదేరింది...
20. సృష్టికర్త
దాసులము
సృష్టికర్త దాసులము
మేము
ఈ సృష్టిలో ఉన్న
ఆటబొమ్మలం
దిన దినమూ నిను
వేడుచున్నాము
స్వర్గానికి దారి
వెదకు చున్నాము
మా హృదయం
తల్లడిల్లి పోతుంది
స్వర్గాన్ని
చూడాలని అంటుంది
-సృష్టికర్త
దాసులము...
నీ నామమే మాకెంతో
మధురమయా
నీ ప్రార్థన
సృష్టికి పరమార్థమయా
సంసారమే
సముద్రమనుకోండి
దాని దాటించేవాడు
దైవమండి
-సృష్టికర్త దాసులము...
మా కంటికి కానరాని
వాడివయా
నీవెంతటి దయామయుడవు
ఓ ఈశ్వరా
మా కొరకు గ్రంథాలు
పంపావు
చీకటిలో ఉన్న మాకు
వెలుగు చూపినావు
-సృష్టికర్త
దాసులము...
దిన దినమూ నిను
వేడుచున్నాము
స్వర్గానికి దారి
వెదకుచున్నాము
మా హృదయం
తల్లడిల్లి పోతుంది
స్వర్గాన్ని
చూడాలని అంటుంది
-సృష్టికర్త
దాసులము...
21. వేదనతో
నిను వేడితిమి
వేదనతో నిను
వేడితిమి ఓ ఈశ్వరా
మా విశ్వాసమే ఆరని
జ్యోతిగా
నిలుపుము ఓ ఈశ్వరా
-వేదనతో...
కోటి సూర్యుల
తేజోమయుడా
నిను చూసిన వారెవరయ్యా
అణువుకంటే
సూక్ష్మమైన
అవ్యక్తుడవు
నీవయ్యా
-వేదనతో...
వెల్లువల్లే వ్యధలు
వచ్చినా
ఉప్పెనల్లె
కడగండ్లు కలిగినా
విశ్వాసము
సన్నగిల్లని నీ దాసులు
నీ పరీక్షకు
నిలిచారు నీ మహిమతో
-వేదనతో...
సముద్రపు అలలవలె
గుమ్మిగూడె రోజొకటుందని
మాటువలె నరకం
కాచుకుందని
నీ దండనకు
తల్లడిల్లుచున్నామయ్యా
నీ కృపకొరకు
తపించుచున్నామయ్యా
22. స్తుతులకు
పాత్రుడవు నీవే దేవా!
స్తుతులకు
పాత్రుడవు నీవే దేవా!
కరుణామయుడా ఓ
ఈశ్వరా!
సకల లోకములకు
ప్రభుడవు నీవు
అపారకృపాశీలుడవు
ప్రతిఫల దినానికి
స్వామివి నీవే
నిన్నే మేము
ఆరాధింతుము
-స్తుతులకు...
పెంచేవాడవు
యుక్తిపరుడవు
నిర్వాహకుడవు నీవే
దేవా
యజమానుడవు
సృష్టికర్తవు
ఆరాధ్య దైవం నీవే
దేవా
-స్తుతులకు...
సరియైన మార్గం
చూపించువాడా
చక్రవర్తివి
పరిపాలకుడా
రుజువైన మార్గం
చూపించువాడా
సహాయం కొరకు
అర్థించెదము
-స్తుతులకు...
బహుమానాలకు అర్హత
పొందే
నీ ప్రేమ పాత్రులు
నడచిన మార్గం
మార్గభ్రష్టులు
కానివారి
నీ ఆగ్రహానికి
గురికాని వారి
మార్గములో మమ్ము
నడిపించు దేవా
-స్తుతులకు...
23. ప్రపంచ
దేశపు మానవులారా!
ప్రపంచ దేశపు
మానవులారా
అందరు ఒకటే
సోదరులారా
ఈశ్వరుడన్నా యెహోవా
అన్నా
అల్లాహ్ అని
ఎలుగెత్తి చాటినా
దేవుడు ఒకడేలే
దేవుని ధర్మం
ఒకటేలే
-ప్రపంచ దేశపు...
గాలిలో ఎగిరే
పక్షులకైనా
కులము ఎక్కడండీ
నీటిలో ఈదే
చేపలకైనా
మతము లేదులెండి
వాటికి ఇవ్వని
జ్ఞానాన్ని
మనిషికి ఇచ్చాడా
దైవం
-ప్రపంచ దేశపు...
ఆవులు రంగులు ఉన్నా
ఆవుల పాలు
తెల్లనండీ
మనుషులు వేరుగ
ఉన్నా
మనుషుల
రక్తమెర్రనండీ
కులబేధాలే విడవండి
మతద్వేషాలే మానండి
-ప్రపంచ దేశపు...
పాలు వెన్నెల కన్నా
దేవుని మాట
కమ్మనండీ
దేవుని ఆజ్ఞను
పాటిస్తేనే
మోక్షముండునండి
కార్పణ్యాలే
విడవండి
కలసి మెలసి మెలగండీ
-ప్రపంచ దేశపు...
24. ఓ
సోదరులారా సారాంశము వినరండి!
ఓ సోదరులారా
సారాంశము వినరండి
శరీరము శాశ్వతమా
దైవాన్ని స్మరించండి
చరాచర జగతిని
కనరండి
తరించు మార్గ
ఒకటేనండి
-ఓ సోదరులారా...
ఈరోజు నాయకుడైన
ఎనలేని సంపదలున్నా
పరదేశ చదువులలోన
ప్రజ్ఞాని అయినా
మరుభూముల తేడా
ఉన్నా ఆరడుగుల నేలేనన్నా
అందరికి సొంతమవునా
-ఓ సోదరులారా...
పాపాలు చేసి నీవు
ప్రసాదాలు పంచినావా
ప్రపంచాన్ని
మోసగించి పెట్టె నింపినావా
ఇపుడున్నది నీకే
విజయం రానున్నది దేవుని తరుణం
అపుడు వగచి
ఫలితమేమి
-ఓ సోదరులారా...
చిత్రమైన రైలుబండి
సర్వజగతి చూడండి
యాత్రికులే
జీవులండి ఎక్కిదిగుచు రండి
ఏ క్షేత్రములను
తిరిగినను సత్రములను కట్టించినను
చావయినా తప్పదన్నా
-ఓ సోదరులారా...
వెనుకనున్న
వారికోసం యోచింపనేమి ఫలితం
కనుగొనరా ఎవరికి
యమునా తీరే
భ్రమచెందే ఓ నరుడా
కనుగొనుమా దేవుని జాడ
కనుగొంటే నీవు
ధన్యుడివిరా
-ఓ సోదరులారా...
25. సోదరా
సోదరీ ఆలోచించవా!
సోదరా ఓ సోదరీ!
ఆలోచించవా
జీవితం క్షణభంగురం
కాదోయి శాశ్వతం
-సోదరా ఓ సోదరీ...
భ్రమపడకు సోదరా
బలవంతుడననుకొని
బలవంతుడైన వాని
ముందర
బలహీనుడవై నిలవాలని
తెలుసుకుంటే మేలొయి
సోదర
శాశ్వత జీవితముంది
నీ ముందర
-సోదరా ఓ సోదరీ...
గాజుపాత్ర నీ
జీవితం చేజారింద చెక్కలవునురా
కరుణామయుని నీవు
వెతకినా
కనుగొందువు కాంతి
లోకమే
తెలుసుకుంటే మేలొయి
సోదరా
శాశ్వత జీవితముంది
నీ ముందర
-సోదరా ఓ సోదరీ...
నశియించే సంపదకై
ఆరాటం ఎందుకురా
ఎవరికి ఇది సొంతం
కాలేదురా
అంతా నాదన్న
వారందరూ
ఏమి తీసుకెళ్ల
లేదురా
తెలుసుకుంటే మేలొయి
సోదర
శాశ్వత జీవితముంది
నీ ముందర
-సోదరా ఓ సోదరీ...
26. ఆలోచించు
ఆలోచించు అన్నయో!
ఆలోచించు ఆలోచించు
అన్నయో
ఆలోచించు ఆలోచించు
చెల్లెలా
సుడిగాలిలోని దీపమంటే
జీవితమూ
మహాసాగరాన బుడగవలె
ఉన్నదిరా
దీపం ఆరినా బుడగ
పగిలినా
అంతేనోయీ జీవితము
అంతే తెలియని జీవితము
-ఆలోచించు...
కండ గలవాడినని
ఓరన్నా
కన్నుగానక నీవు
తిరిగావ
కండ గుండె ఉండగనే
కదలవేమిరోరన్నా
చీమకంటె నీవిపుడు
చిన్నవేరన్నా
ఈగనైన తోలనట్టి
బలహీనుడవన్నా
-ఆలోచించు...
కొసమెరుపులాగ
మెరిసేవు ఓరన్నా
అది శాశ్వతమని
మురిసావు పెద్దన్నా
రాలిపడు చుక్కవలె
అయిపోబోకురా
ఆకాశాన్న ఉన్నపుడే
దాని విలువ ఉండునురా
ప్రాణమున్నంత వరకే
నీ విలువ ఉండునురా
-ఆలోచించు...
కళ్లకు కనబడని
దైవమన్నాడులే
జనన మరణాలు ఆయనకు
లేవులే
ఆ దైవమునే
ప్రార్థించాలన్నా
ఆతని ముందర
నిలవాలన్నా
చేసిన కర్మలకు
బదులివ్వాలన్నా
-ఆలోచించు...
27. సత్యసందేశం
పిలుపు
సాఫల్యం వైపునకు
ప్రజలారా మరలండీ
సత్య సందేశం పిలుపు
విని ఉప్పెనలా తరలి రండి
-సాఫల్యం...
అక్రమాలు అవినీతి
మన సమాజ దుస్థితి
స్వార్థమూ
బంధుప్రీతి రాజ్యమేలుతున్నాయి
కులమత బేధాలను రగిలించే
దుష్టశక్తులున్నాయి
మానవతను
చీల్చునట్టి రాబందులు ఉన్నాయి
-సాఫల్యం...
కళల పేర జారిపోయే
మన మహిళల వలువలు
ఫ్యాషన్ల పేరుతో
దిగజారే విలువలు
ఆధునికత ముసుగులోన
విశృంఖల చేష్టలూ
కామాంధుల కోరల్లో
బలి అయ్యే యువతులూ
-సాఫల్యం...
తాగుడూ జూదాలు రాజ్యమేలుతున్నాయి
మాదక ద్రవ్యాలే
మనిషినేలుతున్నాయి
దోపిడి దౌర్జన్యాలు
నిత్యకృత్యమైనాయి
శాంతి స్నేహాలే
కనుమరుగవుతున్నాయి
-సాఫల్యం...
ప్రవాహాని కెదురీదే
శక్తి మీకు ఉందండి
కొండనైన పిండిచేసె
కండబలం ఉందండి
సమ సమాజ స్థాపనకై
చేయి చేయి కలపండి
నైతిక విలువలు
పెంచి శాంతిని స్థాపించండి
-సాఫల్యం...
28. మానవుడా
వివేకమున్న జీవుడా!
మానవుడా వివేకమున్న
జీవుడా
మనసు పెట్టి చూడుమా
నీమది యోచన చేయుమా
ఎలా కాదనగలవయ్యా నీ
సృష్టికర్త శుభాలను
ఎలా మరువగలవయ్యా
కళ్లముందు కదిలే ఈ సూచనలు
-మానవుడా...
కుళ్లిన మట్టితో
చేసాడు నిన్ను
సుందర ఆకృతిలో
మలిచాడు నిన్ను
జానెడు గర్భాన్ని
జగమంతగా చేసి
కటిక చీకటిలో
కారుణ్యం చూపి
ధరణికి తెచ్చినోడు
ఆ స్వామి కాదా
నడకలు నేర్పినోడు ఆ
స్వామి కాదా
-ఎలా
కాదనగలవయ్యా...
జీవరాసుల్లోన
జ్ఞానిగ నిను చేసి
ప్రకృతినంతటిని నీ
సేవకు నియమించి
ఆరడుగుల నిన్ను
అందలాని కెక్కించి
అందునా తన సృష్టిని
నీ ముందర వంచి
శాస్త్రాలు
పంపినోడు ఆ స్వామి కాదా
మార్గము చూపినోడు ఆ
స్వామి కాదా
-ఎలా
కాదనగలవయ్యా...
రాజులు ఎందరో
గతియించిపోయారు
మహానీయులందరు
భువిని విడిచి వెళ్లారు
మురిసిపోకు ఈ
జీవితం శాశ్వతమనుకొని
మరువకు మనమంతా
బాటసారులమనియు
శాశ్వతమైనవాడు ఆ
స్వామి కాదా
మరణము లేనివాడు ఆ
స్వామి కాదా
-ఎలా కాదనగలవయ్యా...
తీర్పు దినాన
తప్పించుకోలేవు
ఎలాంటి సిఫారసును
నీవక్కడ పొందలేవు
అందరిలో నిన్ను
ఒంటరిగా చేసి
చేసిన కర్మలకు
సమతూకం తూచి
వరములు ఇచ్చువాడు ఆ
స్వామి కాదా
స్వర్గాన
చేర్చువాడు ఆ స్వామి కాదా
-ఎలా కాదనగలవయ్యా...
29. దేవా
శరణు వేడుచున్నామయా
దేవా శరణు
వేడుచున్నామయా
దేవా శరణు
వేడుచున్నామయా
దుష్టవాంఛలు రేపే ఆ
దుష్టుని నుండి
నీ శరణు
వేడుచున్నామయా
నీ శరణు
వేడుచున్నామయా
-దేవా...
మానవ శత్రువు
షైతానూ ముక్కలుగా మము జేసేనూ
మానవ శత్రువు
షైతానూ ముక్కలుగా మము జేసేనూ
ప్రతి ఒకనికి ఒక
మార్గాన్ని చూపి
రుజుమార్గము
తప్పించేనూ
ఆ రుజుమార్గమేదో
చూపించవా
ఏక త్రాటిపై మమ్ము
నడిపించవా
-దేవా...
మనసులో జేరిన
షైతానూ మానవతను మరిపించేను
మనసులో జేరిన
షైతానూ మానవతను మరిపించేను
కులమత బేధాలు రేపి
కట్టెలుగా మము
వాడేనూ
మానవత్వాన్ని మాలో
కలిగించవా
ఏక త్రాటిపై మమ్ము
నడిపించవా
-దేవా...
కౄరమృగాలు సైతం
నేడు సిగ్గుతో తల వంచెను చూడు
కౄరమృగాలు సైతం
నేడు సిగ్గుతో తల వంచెను చూడు
నాగరికత గల ఈ మనిషి
తీరు
మనుషుల ప్రాణాలు
తీసేనూ
ఆ షైతాన్ని
ఎదిరించే శక్తివ్వవా
ఏక త్రాటిపై మమ్ము
నడిపించవా
-దేవా...
30. మానవుడ
ఓ మానవుడా!
మానవుడ ఓ మానవుడా
పరమదాత నీ ప్రభువు
మహోన్నతుడు నీ
ప్రభువు
సమస్త మానవాళిని
పోషించేది నీ ప్రభువు
సకల జీవులను
సృష్టించే సృష్టికర్త నీ ప్రభువు
పోషించేది నీ
ప్రభువు
-మానవుడ...
నఖసిఖ పర్యంతం నిను
తీర్చిదిద్దాడు
చక్కనైన ఆకారం నీకు
ప్రసాదించాడు
లోపాలు లేకుండా
నిను మలచి నిలిపాడు
తగిన రీతిలో
పొందికగా నిను రూపొందించాడు
మరిచావా ఆ స్వామినీ
నిను మలచిన నిజ
స్వామినీ
-మానవుడ...
ఆకాశం బ్రద్దలైన
వేళా
నక్షత్రాలు చెదిరిన
వేళా
సముద్రాలు చీల్చబడే
వేళా
మృతులందరు లేపబడే
వేళా
ఏమగునో నీగతీ
తెలుసుకో ఆ స్థిత
-మానవుడ...
సజ్జనులకు స్వర్గం
దుర్జనులకు నరకం
తప్పదోయి తీర్పు
దినం
ఉందోయి దేవునికే
తీర్పు చేసే అధికారం
పొందాలి ఆ దినం
ప్రతి ఒక్కరు స్వర్గం
మానవ జన్మకు ఇదియే
నిజమైన సాఫల్యం
-మానవుడ...
31. సర్వేశ్వరా ఓ దయాకరా!
సర్వేశ్వరా ఓ
దయాకరా
మా తప్పిదాలు గావరా
మా జీవితాలు మలచవా
-సర్వేశ్వరా...
నువు తప్ప లేడు
దైవము
నీవేకదా మా సర్వము
ఏకైక స్వామి నీవెగా
నీకే కదా మా స్తోత్రము
కరుణామయా ఓ పోషకా
కరుణించి మమ్ము బ్రోవుమా
-సర్వేశ్వరా...
ఈ పాలవెల్లి
వెలుగులు
ఈ సూర్య చంద్ర
తారలు
నదీ నదాల సోయగం ఈ
కొండలు ఎడారులు
నీ సైగపైనే ఈ జగం
ఆగురా చలించురా
-సర్వేశ్వరా...
ఏదైయ్యా శాంతి
సౌఖ్యము
కనపడదు మానవత్వము
లోకాన అలముకుందిగా
అజ్ఞాన అంధకారము
నిజమైన
ధర్మజ్యోతిని ప్రసరింప జేయవో ప్రభూ
-సర్వేశ్వరా...
నిను
విస్మరించినందుకే
నిను
ధిక్కరించినందుకే
కష్టాల పాలు
అయితిని నీ దారి విడచినందుకే
నిజజ్ఞాన మొసగుమో
ప్రభూ నీ బాటపైన నడుపరా
-సర్వేశ్వరా...
32. విశ్వమందు నివసించే ఓ మనిషి
ఈ విశ్వమందు
నివసించే మనిషీ ఓ మనిషీ
నీకు తెలుసా ఈ
సృష్టిని సృష్టించిన
సృష్టికర్త ఒకడేనని
తెలుసా నీకు తెలుసా
తెలియకపోతే
తెలుసుకో
నేలను అడిగి చూడు
నింగిని అడిగి చూడు
సూర్యుని అడిగి
చూడు చంద్రుని అడిగి చూడు
అవి ఏకంగా చెబుతాయి
మన దేవుడు ఒక్కడేనని
మన దేవుడు ఒక్కడే
నని
-ఈ విశ్వమందు...
పగలు రేయన్నది
దేవుడి కరుణేనని తెలుసా
నీకు తెలుసా
తెలియకపోతే తెలుసుకో
తరాలు మారినా
యుగాలు గడచినా
సూర్య చంద్రుల
గమనాలు మారునా
అవి ఎలుగెత్తి
చెబుతాయి మన దేవుడు ఒక్కడేనని
-ఈ విశ్వమందు...
చావు పుటుక అన్నది
దేవుని క్రియేనని తెలుసా
నీకు తెలుసా
తెలియకపోతే తెలుసుకో
పుట్టిన ప్రతివాడు
గిట్టక మానడని
పుట్టి గిట్టనోడు
జగాన లేడని
చావు పుటుక
లేనివాడూ ఆ దేవుడు ఒక్కడేనని
-ఈ విశ్వమందు...
దైవ స్మరణ లేనివాడు
విశ్వాసియే కాడని తెలుసా
నీకు తెలుసా
తెలియకపోతే తెలుసుకో
బైబిల్ నడిగి చూడు
గీతను అడిగి చూడు
ఖురాన్ ను అడిగి
చూడు వేదాలనడిగి చూడు
అవి ఏకంగా చెబుతాయి
దేవుడు ఒక్కడేనని
మన దేవుడు
ఒక్కడేనని
-ఈ విశ్వమందు...
33. చేయి కలుపు సోదరా
చేయి కలుపు, చేయి కలుపు సోదరా
సాఫల్యం వైపునకు
సాగుదాం
మనం సృష్టికర్త
వైపునకు సాగుదాం
-చేయి కలుపు...
మాయ నుండి మత్తు
నుండి
ఆచారాల పట్టు నుండి
సాఫల్యం వైపునకు
సాగుదాం
మనం
సృష్టికర్తవైపునకు సాగుదాం
జీవితం పరీక్షరా, గుర్తెరిగి నువు జీవించరా
-చేయి కలుపు...
ఆకాశాన్ని చూడరా
భూమి స్థితిని
గాంచవా
దృష్టిని సారించి
తెలుసుకో
సృష్టి గమన
నిర్దేశకుడెవరని
-చేయి కలుపు...
జంతువుని కానని
పక్షినసలె కానని
గర్వించే సోదరా
తెలుసుకో
జ్ఞానిగ నిను
చేసినోడు ఎవరని
-చేయి కలుపు...
భీకర తుఫానులూ
భీతిగొలిపే భూకంపం
సృష్టికర్త ఉగ్రతని
తెలుసుకో
తెలుసుకొని నీ
బ్రతుకును దిద్దుకో
-చేయి కలుపు...
34. అద్వితీయ దేవుడా అందుకొనుము అంజలి
అద్వితీయ దేవుడా
అందుకొనుము అంజలి
అందనంత ఎత్తులో
పరమునున్న మా దేవా
నీ నామమే కీర్తించ
నీ ఘనతను కొనియాడ
చెట్లన్నియు కలాలు
చేసి ఆ...
సముద్రాన్ని సిరా
చేసి రాసినా
చాలవయ్య సాగరాలు
చాలవయ్య వృక్షాలు
-అద్వితీయ...
నింగిలోని చుక్కలు
నీ ప్రేమకు
గురుతులు
అవి చిమ్మే కాంతులు
నీ కరుణామృత ధారలు
చుక్కలే
లెక్కించలేమయా
స్వామి చుక్కలే
లెక్కించలేమయా
నీ మహిమను ఎలా
గుర్తించగలమయా
-చెట్లన్ని...
ఎంత చిత్రమైనవాడు
నువు చేసిన దాసుడు
పక్షిలాగ ఎగురుతాడు
చేపలాగ ఈదుతాడు.
నీ దాసుని జ్ఞానమే
నింగినంటుచుండగా
నీ జ్ఞానం ఇంతని
ఎలా ఊహించగలమయా
-చెట్లన్ని...
35. ఏ జీవికి లేనట్టి గొప్ప శక్తి
ఏ జీవికి లేనట్టి
గొప్ప శక్తి సోదరా
నీకే ఉందంటే కాదు
అతిశయోక్తి
అదే జ్ఞానం అనే
అద్భుత శక్తి
దైవాన్ని
తెలుసుకొనుటయే నీ యుక్తి
-ఏ జీవికి...
నేను చేయలేనిదేదియు
లేదంటావు
ఏదీ కురిపించు ఓ
వర్షపు బిందువు
నాకు తెలుసునులే
అంటావు సర్వము
ఏదీ తెలియని నీ
కెందుకు ఇంత గర్వము
-ఏ జీవికి...
పాపాలకు పునాది నీ
అహంకారము
దేవుని కనుగొంటె
పొందుదువు ఆయన మమకారము
సర్వలోక సృష్టికర్త
ఆ కరుణామయుడు
అది గమనించిన వాడే
పుణ్యాత్ముడు
-ఏ జీవికి...
రేపు రేపు అంటావు
ప్రతి దానికి
ఎవరికెరుక రేపు
నీదో కాదో చెప్పడానికి
దీపముండగానే ఇల్లు
చక్కబెట్టుకో
జీవముండగానే
ఈశ్వరుని తెలుసుకో
సర్వేశ్వరుని
తెలుసుకో
-ఏ జీవికి...
36. ఇల్లు ఇల్లంటావు
ఇల్లు ఇల్లంటావు
ఉల్లాస పడతావు నీ ఇల్లు ఎక్కడో తెలుసా
అల్లంత దూరాన
పరలోకమందునా
నీ ఇల్లు ఉన్నదే
మనసా
-ఇల్లు ఇల్లంటావు...
వచ్చునాడు నీవు
వెంటేమి తెచ్చేవు పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి
మూజ్ఖాళ్ల ముచ్చటకే
మురిసేవు భ్రమసేవు
ముందుగతి గానక ఓ
మనసా
-ఇల్లు ఇల్లంటావు...
ఆలుబిడ్డలనుచు
అన్నదమ్ములనుచు ఆరాటపడబోకు మనసా
వారిని వదిలి నీవు
వెళ్లేటి రోజునా
నీ వెంట ఎవరు రారు
మనసా
-ఇల్లు ఇల్లంటావు...
ఆస్తిపాస్తుల కొరకు
అస్తమానం నీవు కుస్తీలు పట్టేవు మనసా
అస్థిరములపైన
గస్తీలు నీకెలా
వాస్తవ మాలోచించు
మనసా
-ఇల్లు ఇల్లంటావు...
ఊపిరి ఉన్నన్నాళ్లు
ఊరిలోని వారు మావాడు అంటారు మనసా
ఊపిరి పోగానే భార్యా
బిడ్డలు కూడా
నిను తాక జంకుతారు
మనసా
-ఇల్లుఇల్లంటావు...
పేరు తెచ్చానంటు
పైకి వచ్చానంటు విర్రవీగకు వెర్రి మనసా
విశ్వాన నీవెంత
నీపేరు ఎంతెంత
ఇకనైన మేలుకో మనసా
-ఇల్లు ఇల్లంటావు...
నీదన్న దేహమే నిను
కాదని పోవు నీదన్న దేదిక ఓ మనసా
ఎవరిది ఏదీలేదు ఏదీ
నీతో రాదు
నిజమింతే తెలుసుకో
మనసా
-ఇల్లు ఇల్లంటావు...
పుట్టుకలేనివాడు
కళ్లకు కనబడని దైవమున్నాడు ఓ మనసా
అనిత్యమైన
జీవితాన్ని పొందిన నీవు
ప్రార్థించు
దైవాన్ని మనసా
-ఇల్లు ఇల్లంటావు...
37. ఎన్నాళ్లున్నా ఎన్నేళ్లున్నా
ఎన్నాళ్లున్నా
ఎన్నేళ్లున్నా ఒక నాటికి వెళ్లిపోక తప్పదురన్నా
సిరి సంపదలున్నా
అధికారాలున్నా ఒకనాటికి వేడి పోక తప్పదురన్నా
ఎన్నాళ్లున్నా
ఎన్నేళ్లున్నా ఒక నాటికి వెళ్లిపోక తప్పదురన్నా
సిరి సంపదలున్నా
అధికారాలున్నా ఒకనాటికి వేడి పోక తప్పదురన్నా
-ఎన్నాళ్లున్నా...
ఇహలోకం కొన్నాళ్ల
జీవితం
పరలోకం శాశ్వత
జీవితం
నీవు ఏది కోరుకుంటావో
నీవేది కోరుకుంటే
నీ కదే జీవితం
నీకదే జీవితం
-ఎన్నాళ్లున్నా...
ఈ కలలాంటి జీవితం
కొన్నాళ్లురా
ఆ శాశ్వత జీవితం
యుగయుగాలురా
నీ కంటికి కనబడని
దైవాన్ని గుర్తించున
నీ హృదయాన్ని
గ్రంథాలవైపే మళ్లించు
గ్రంథాలవైపే
మళ్లించు
-ఎన్నాళ్లున్నా...
నిన్ను మనిషిగా
పుట్టించాడెందుకని
ప్రతి క్షణం
యోచించు అసలు దైవమెవరని
ఆ దైవాన్ని మరచితే
నీ బ్రతుకే వ్యర్ధమురా
ఆ దైవాన్ని
తెలుసుకుంటే
నీ జన్మే ధన్యమురా
నీ జన్మే ధన్యమురా
-ఎన్నాళ్లున్నా...
38. వినోదాల వింత జగతిలో
వినోదాల వింత
జగతిలో వెంట వచ్చేదేమిరా
మనసు తనువును
వీడినంతనే మాయమవును అంతరా
బురద మట్టి గూడురా
ఇది మట్టిలోనే కలయురా
హెచ్చు తగ్గుల
బేధములతో వాదులాడగ వద్దురా
వాదులాడగ వద్దురా
-వినోదాల...
రాజు పేద అన్న
బేధము బ్రతికి ఉండేవరకెరా
మట్టిలోన కలిసినాక
ఎట్టి బేధములుండురా
ఎట్టి బేధములుండురా
-వినోదాల...
ఆలుబిడ్డలు అన్నదమ్ములు
అంతయును ఒక ఆటరా
ఎవరి కర్మకు వారు
బాధ్యులు తప్పదిదియే నిజమురా
తప్పదిదియే నిజమురా
-వినోదాల...
బంధుమిత్రులు అంత
కలసి నిన్ను తీసుకువెళ్లురా
నిన్ను అక్కడ
పూడ్చిపెట్టి వారు తిరిగి వచ్చురా
వారు తిరిగి
వచ్చురా
-వినోదాల...
ఇహమునందు నీవు
చేసిన కర్మ ఫలితమే దక్కురా
దాని ఫలితమే నీదు
వెంట విడువకుండా ఉండురా
విడువకుండా ఉండురా
-వినోదాల...
దేవుడొకడని
విశ్వసించిన శాంతి సుఖములు కలుగురా
పుణ్యకార్యములాచరించిన
ఫలితమపుడే దక్కురా
ఫలితమపుడే దక్కురా
-వినోదాల...
39. ఏమరుపాటుకు గురికాకు
ఏమరుపాటుకు
గురికాకు
మేలుకో మానవుడా
సత్యమేదో అసత్యమేదో
తెలుసుకో మానవుడా
-ఏమరుపాటకు...
నింగి నుండి నేల
నుండి
ఉపాధినిచ్చే దేవుడు
ఎవరో
వెలుగు చీకటి
సృజించినోడు
దేవుడెవరో
గ్రహించవా
దేవుడెవరో
గ్రహించవా
-ఏమరుపాటకు...
బాహ్యమైన గోప్యమైన
బయటపెట్టే
సమయముందిలే
తండ్రి ఆజ్ఞను
గైకొంటె
నిత్య జీవముండునయ
నిత్య జీవముండునయా
-ఏమరుపాటకు...
ఆది నీవే అంతము
నీవే
మార్పులేని
దేవుడవయ్యా
విశ్వవ్యవస్థకు
ఆధారం
నిత్యుడైన
దేవుడవయ్యా
నిత్యుడైన
దేవుడవయ్యా
-ఏమరుపాటకు...
40. అందమైన జీవితం
అందమైన జీవితం
అంతమై పోతుందని
తెలుసుకో ఓ నరుడా
మేలుకొని మసలుకో
-అందమైన..
ఆ దేవుని ముందు మనం
లెక్కచూపవలెననీ
ఆ దేవుడు మన
కర్మలకూ
ఆ దేవుడు మన కర్మల
లెక్క తీసుకుంటాడని
మరువబోకు ఈ సత్యం
మార్చుకో నీ పయనం
-అందమైన...
కనిపెంచిన నీ తల్లి
కలలు గనే నీ తండ్రి
కలకాలం నీకు తోడుగా
కలకాలం నీకు తోడు
నడిచే నీ సతీమణి
రారెవ్వరు నీ వెంట
నీ ఊపిర పోయాక
-అందమైన..
ఇహలోకమె సర్వమని నీ
ఇల్లె స్వర్గమనీ
దైవాన్నే
మరచిపోకుమా
దైవాన్ని మరచిపోయి
జీవించే ఓ మనిషి
నీ లెక్కల ఘడియ సదా
నడుస్తోంది నీవెంట
-అందమైన...
41. హిందువులారా ముస్లిములారా...
హిందువులారా
ముస్లిములారా ఓ క్రైస్తవులారా
మనమందరమొకటేనని
మీరు మది భావించండి
మతాలతో పనిలేదండి
సమైక్యతతో మెలగండి
-హిందువులారా...
ఈశ్వరుడు గొప్పవాడు
యెహోవా గొప్పవాడు
అల్లాహ్ యే
దేవుడంటూ వాదించుతారా
సృష్టికర్త ఒకడే
కాదా జగమంతయు అతడిదే కాదా
తగవేల అల్లరేల
మనమందరమొకటేనని
మీరు మది భావించండి
మతాలతో పనిలేదండి
సమైక్యతతో మెలగండి
-హిందువులారా...
పైకెగురు పక్షులలోన
మతమేది వాటిలోన
మనకన్నా అవియే
మిన్న గమనించినారా
కులబేధాలే విడవండి
మతద్వేషాలే మానండి
మనమంత ఒక్కటండీ
మనమందరమొకటేనని
మీరు మది భావించండి
మతాలతో పనిలేదండి
సమైక్యతతో మెలగండి
-హిందువులారా...
ఉన్నాయి ఉంగరాలు
అలరించే నాగరాలు
ఎన్నెన్నో భూషణాలు
ఇంపయినవి
ఆభరణములెన్నిగ
ఉన్నా బంగారం ఒకటే కాదా
ఏ భాషలో
పిలిచినగాని మనదేవుడు ఒకడే కాదా
తగవేల అల్లరేల
మనమందరమొకటేనని
మీరు మది భావించండి
మతాలతో పనిలేదండి
సమైక్యతతో మెలగండి
-హిందువులారా...
42. మాయేరా జీవితమంతా
మాయేరా జీవితమంతా
మాయేరా జీవితమంతా
చెట్టుకు కాచిన
కాయొకటికిరా
పండునురా ఓ నరుడా
పండునురా ఓ నరుడా
పండిన ఫలము రాలుట
నిజము
ఇంతే మానవ జన్మ
ఇంతే మానవ జన్మ
పుట్టుట ఎచటో
గిట్టుట ఎచటో
తెలియదురా ఓ నరుడా
తెలియదురా ఓ నరుడా
-మాయేరా...
మూడు దినాల ముచ్చట
కోసం
మోహం ఎందుకు నరుడా
కష్ట సుఖాల
కూడికయేరా
కనుగొంటే బ్రతుకంతా
కనుగొంటే బ్రతుకంతా
-మాయేరా...
వేదనకొంత వేడుక
కొంత
ఇంతే ఈ బ్రతుకంతా
ఇంతే ఈ బ్రతుకంతా
ఈ భూమియందు దేవుని
స్మరణ
మరువకురా ఓ నరుడా
మరువకురా ఓ నరుడా
దేవుని ముందు మనమే
పాటి
కనుగో ఈ జగమంతా
కనుగో ఈ జగమంతా
-మాయేరా...
43. కునుకు రాని నిదురపోని
కునుకు రాని నిదుర
పోని ఏకైక దేవుడవు
అలసిపోని
సొమ్మసిల్లని ఏకైక దేవుడవు
వేదాల్లోన
పురుషోత్తముడవు
బైబిల్లోన
శక్తిమంతుడవు
ఖురానులోన
పరిశుద్ధుడా
ఖురాను లోనా
పరిశుద్ధుడా
-కునుకురాని...
సర్వసృష్టికి
శిల్పివయా
మహోన్నతుడా ఓ దేవా
ఆగక సాగే తారల
గమనాలు
అందించేను హారతులు
అందించేను హారతులు
-కునుకురాని...
సూర్యచంద్రుల
నియామకుడా
సర్వోన్నతుడా ఓ
స్వామి
ఆగక పొంగే ఆ
సాగరాలు
నిరతము చాటెను నీ
అధికారం
నిరతము చాటెను నీ
అధికారం
-కునుకురాని...
44. రాజాధిరాజువయ్యా
రాజాధిరాజువయ్యా
విశ్వ ప్రభువు
నీవయ్యా
నీ నామమెంతో మధురం
నీ కరుణేమాకు శరణం
-రాజాధిరాజు...
నిత్యుడైన ఓ నా దేవా
కునుకైనా రాని
ప్రభువా
మము గాంచు వాడవయ్యా
నువ్వే మా
దిక్కువయ్యా
నీ కరుణే మాకు శరణం
నీ కరుణే మాకు శరణం
-రాజాధిరాజు...
ఆది మథ్యాంత
రహితుడవు నీవు
కరుణామయుడవు నీవు
నీ ధర్మపాలనలోనా
అన్యాయం జరుగదయ్యా
నీ కరుణే మాకు శరణం
నీ కరుణే మాకు శరణం
-రాజాధిరాజు...
మేము చేసే
తప్పిదాలూ
కరుణించి
మన్నించవయ్యా
నరకాగ్ని బారినుండి
రక్షించి బోవుమయ్యా
నీ కరుణే మాకు శరణం
నీ కరుణే మాకు శరణం
-రాజాధిరాజు...
45. నీటి అలలపమీద నా నావ సాగిపోతుంది
నీటి అలలపమీద నా
నావ సాగిపోతుంది
దేవా నీ కరుణ చేత
నా బ్రతుకు సాగిపోతుందీ
హైలెసా... హైలెసా...
హైలెసా...
హైలెసా...
హైలెసా... హైలెసో... ఆ... ఆ... ఆ.
హైలెసా...
హైలెసా... హైలెసో... హోయి...
-నీటి అలలమీద...
ఆయ్యా చిరుగాలి
గురుతు చేసెలే నీవు చల్లని మనసున్న సామివే
ఈ చిరుజల్లు గురుతు
చేసెలే నీవు చల్లని మనసున్న సామివే
ఈ చిరుగాలులు అయ్యా
నీ కరుణేలే
ఈ చిరుజల్లులు
అయ్యా నీ మహిమేలే
ముద్దకలిసి
నోటికిచ్చే తల్లి ప్రేమకన్నా
ఆ తల్లికట్టి
మనసిచ్చిన నీవే మిన్న ఆయ్యా నీవే మిన్న
-నీటి అలలమీద...
ఆకాశం గురుతు
చేసెలే దాన్ని ఆరేసినోడివి నీవేనని
ఈ భూమి గురుతు
చేసెలే దాన్ని పాన్పుగా చేసింది నీవేనని
ఆ ఆకాశానికాధారం నీ
వాక్కేలే
ఈ భూమికాధారం నీ
పలుకేలే
జోలపాడి
నిదురపుచ్చే తండ్రి ప్రేమకన్నా
ఆ తండ్రికట్టి మనసిచ్చిన నీవే మిన్న ఆయ్యా నీవే మిన్న
-నీటి అలలమీద...
46. స్మరించవా నీ సృష్టికర్త
నామాన్ని
స్మరించవా నీ
సృష్టికర్త నామాన్ని |
గుర్తించవా నిను
పోషించిన దైవాన్ని
-స్మరించవా...
నిలకడ నీకు ఉంటే
నీ జ్ఞానేంద్రియాలు
నీకు స్నేహితులు
నిలకడ లేకపోతే
అవి నీకు శత్రువులు
బలహీనుడవు కావులే
నీవు
భగవంతుడు నీకు
తోడులే
-స్మరించవా...
రాబోయే కాలంలో
మోక్షము ఉందిలే
దేహం అంతరించిన
ఆత్మ నిలిచి
ఉండునులే
నువ్వు చేసిన
కర్మలు
నీ కర్మల పత్రాలు
నిలువెల్ల తీర్పు
తీర్చె పరలోకమందు
-స్మరించవా...
గడిచిపోయే కాలం
ఒక్క క్షణంలోన
ముగిసిపోయే ఈ
జీవితము
ఏదో ఒక క్షణములో
పరలోక జీవితం
శాశ్వతమని ఇహమునందు
దాని కొరకే కర్మము
చేయుమా
-స్మరించవా...
47.ఖురాను, బైబిల్, గీత ప్రశ్నిస్తున్నాయి
ఖురాను, బైబిల్, గీత ప్రశ్నించెనొక మాట
చరాచర సృష్టికి
మూలమెవరని?
మహనీయుల మాటలు
ప్రవక్తల బాటలు
ప్రశ్నిస్తున్నాయి
నిన్ను ప్రశ్నిస్తున్నాయి
-ఖురాను...
నింగినుండి
వర్షాన్ని కురిపించిందేవరూ?
ఎండిన మట్టినుండి
జీవాన్నిచ్చేది దెవరూ?
వెలుగునిచ్చు
సూర్యుడ్ని పంపేది ఎవరూ?
హాయినిచ్చు
చంద్రుడ్ని చేసింది ఎవరూ?
సువిశాల విశ్వంలో
తిరుగుతున్న గోళంపై
నడుస్తున్న
కాలానికి
అలుపులేని అధికారి
ఎవరూ?
-అని
ప్రశ్నిస్తున్నాయి...
వీర్య బిందువుని
పిండంగా చేసింది ఎవరూ?
పిండానికి ఎముకలను
చేర్చింది ఎవరూ?
తల్లి గర్భాన్ని
యంత్రంగా మార్చింది ఎవరూ?
సర్వాంగ సుందరంగ
నిను మలచింది ఎవరూ?
జీవమిచ్చి
పోషణిచ్చి మరణమిచ్చి
ప్రళయ దినాన నిను
ఎవరూ?
-అని
ప్రశ్నిస్తున్నాయి...
నువు చెయ్యని నిను
చేసిన వాడే దేవుడు
నువు చూడని నిను
చూసేవాడే దేవుడు
జననము మరణము
లేనివాడే దేవుడు
భాగస్వామ్యమే లేని
ఏకైక సృష్టికర్త దేవుడు
దశాంసపు సంఖ్యకాని
త్రయముకాని
ద్వయముకాని లేని
అద్వితీయుడె దేవుడు
-అని
ప్రకటిస్తున్నాయి...
48.ఆలోచించవా... ఆదాము
పుత్రుడా!
ఆలోచించవా. ఆదాము
పుత్రుడా
అంధకార లోయల్లో
అడుగులు వేస్తు
అగ్ని కీలకాలవైపు
పరుగులు తీస్తు
అంధుడవై సత్యమార్గ
భ్రష్ణుడవై సాగిపోయే మానవా
-ఆలోచించవా...
వేవేలమంది
జేజేలతోటి
కాటివరకు నిను
మోసినా
నిను వీడనంటు
ఎడబాయనంటూ
బంధువులే రోదించినా
కఠినమైన తీర్పులో
నీవు ఫైలైతే
రక్షించలేరు జనం, రక్షించలేదు మతం
-ఆలోచించవా...
నా సుఖము నా
బంధువులంటూ
గిరి గీసుకు
బ్రతికావు
ఒక్కడైన
సర్వేశ్వరుని మరచిపోయి
ఇష్టానుసారం
జీవించావు
కఠినమైన తీర్పులో
నీవు ఫైలైతే
రక్షించలేరు జనం, రక్షించలేదు మతం
-ఆలోచించవా...
కర్మలతో కలసి నీ
ప్రయాణం
ఆ కరుణామయుని
చేరినపుడు
చేసుకున్న కార్యాల
ప్రమాణం
సృష్టికర్త
సమక్షంలో ఉంచినపుడు
కఠినమైన తీర్పులో
నీవు ఫైలైతే
రక్షించలేరు జనం, రక్షించలేదు మతం
-ఆలోచించవా...
49. భ్రమలో పడకు వయస్సు
పెరుగుతుందని....
భ్రమలో పడకు వయస్సు
పెరుగుతుందనీ
వాస్తవం గ్రహించు
అది తరుగుతుందని
-భ్రమలో పడకు...
ఈ లోకంలో సుఖముందని
భావించిన వారు కొందరు
ధనముతో బంధువులతో
శాంతి ఉందని మరి కొందరు
వదలి వేయాలి
సమస్తాన్ని నీ ఊపిరి వీడాకా
తప్పదీ వాస్తవం
తెలుసుకో మానవా
-భ్రమలో పడకు...
సుఖదుఖాలు అన్న
ఇచ్చటే కలిసి ఉంటేను
యవ్వనంలో ఉన్నా
వయసు పెరుగుతున్నా
సుందణంతో రెండు
వీడిపోవును
-భ్రమలో పడకు...
నీ కనురెప్పలు మూయక
ముందే నీ జీవితలక్ష్యం గ్రహించుమా
జనన మరణాలకు
అతీతుడు అయిన
అక్షర పరబ్రహ్మను
ధ్యానించు ఇకనైనా
అక్షర పరబ్రహ్మను
ప్రార్థించు ఇకనైనా
-భ్రమలో పడకు...
50.మాయాలోకం మాయాలోకం...
మాయాలోకం మాయాలోకం
మోసపోకు నేస్తమా
నువ్వు మోసపోకు
నేస్తమా
-మాయాలోకం...
బ్రహ్మను నేనని
భ్రమింప చేస్తారు
సొమ్ములు కాజేసి
మోసాలు జేస్తారు
నీ జ్ఞాననముతో నీవు
ఆలోచించవా
-మాయాలోకం...
అబద్ధ బోధకులు
నీవద్ద కొస్తారు
దేవుడే కాని వారిని
దేవుడే అంటారు
యేసు బోధ నీవు
వినలేదా
తండ్రే దేవుడని
బోధించలేదా
-మాయాలోకం...
మసీదు ముల్లాలు మీ
వద్దకు వస్తారు
బాబాలు మీ కొర్కెలు
తీరుస్తారంటారు
ముహమ్మద్ బోధ నీవు
వినలేదా
సర్వానికి
సృష్టికర్త ఒక్కడేనని చెప్పారే
-మాయాలోకం...
నిను
సృష్టించినవాడు జన్మ రహితుడు
జన్మించిన వాడు
దేవుడే కాదురా
ఈ బోధనలో నీవు
జీవించరా
-మాయాలోకం...
51.సృష్టికి కర్త ఒక్కడంటే నమ్మనంటావు...
సృష్టికి కర్త
ఒకడంటే నమ్మనంటావు
ఎందుకనీ న్యాయమా
ధర్మమా
తెలుసుకో వాస్తవం
-సృష్టికి కర్త
ఒకడంటే...
నవమాసాలు నిను
తల్లి గర్భములో ఉంచి
తాను తలచిన ఆకారంలో
పొందికగా చేసి
అందంగా రూపొందించిన
వాడు
-సృష్టికి కర్త
ఒకడంటే...
సూర్యుడు లేనిదే
వెలుగు లేదు
చంద్రుడు లేనిదే
వెన్నెల లేదు
కర్త లేనిదే సృష్టే
లేదు
-సృష్టికి కర్త
ఒకడంటే...
పువ్వు వికసిస్తూ
చెప్పింది నీ జీవితం విలువైనదని
పువ్వు వాడుతూ
చెప్పింది ఈ జీవితం అనిత్యమని
ఈ చిన్ని సమయంలో
గ్రహించు సత్యాన్ని
-సృష్టికి కర్త
ఒకడంటే...
రెండు పాదాల పయనం
ఒక్కటే
రెండు నయనాల గమనం
ఒక్కటే
దైవగ్రంథాల బోధన
ఒక్కటే
సమస్త మానవాళికి
సృష్టికర్త ఒక్కడే
-సృష్టికి కర్త
ఒకడంటే...
52. అనుకున్నవన్నీ నిజము కాదు...
అనుకున్నవన్ని
నిజము కాదని
నిజమన్నది ఒక్కటే ఆ
దేవుడు ఒక్కడేనని
-అనుకున్నవన్ని...
విరబూసిన వెన్నెల
కరిగిపోతుంది
వికసించిన పుష్పం
వాడిపోతుంది
సృష్టి జీవరాశులు
నాశనం అవుతాయి
సృష్టించిన దేవుడు
నిత్యం ఉంటాడు
-అనుకున్నవన్ని...
ప్రేరణ లేకుండా
నాదం ఎలా పలుకుతుంది
స్పందన లేకుండా
హృదయం ఎలా కదులుతుంది
శాస్త్రాలు లేకుండా
జీవనం ఎలా సాగుతుంది
పరబ్రహ్మ లేకుండా ఈ
సృష్టి ఎలా నడుస్తుంది
-అనుకున్నవన్ని...
దైవ గ్రంథాల ధర్మం
ఒకటేనని
రుషులు బోధించిన
సత్యమొక్కటేనని
బ్రహ్మ చేశాడు
సమభావన చట్టం
ప్రజలు చేయాలి
ఆచరణా కర్మం
-అనుకున్నవన్ని...
జనులంతా ఒకటిగా
మారాలి
శాస్త్రాలను
అస్త్రాలుగా చేయాలి
మరుగుపడిన సత్యాలను
వెలికి తీయాలి
సత్యాలను చాటుతూ
ముందడుగు వేయాలి
-అనుకున్నవన్ని...
53. జ్ఞానం ఉన్న ఓ మనిషి
ఆలోచించవా!
జ్ఞానమున్న ఓ మనిషి
ఆలోచించవా!
సృష్టికర్త
యుక్తులను తెలుసుకొనవా!
-జ్ఞానం...
ఎప్పుడైనా
ఆలోచించావా
తల్లి గర్భంలో
తీర్చి దిద్దినోడు ఎవరని
తల్లిదండ్రులు దాని
కర్తలు కారని
బీజముంచిన తండ్రి
అక్షర పరబ్రహ్మని
నిను పొందికగా
తీర్చినోదు సృష్టికర్తని
-జ్ఞానం...
ఎప్పుడైనా
ఆలోచించావా
మేఘాల నుండి నీటిని
కురిపించినోడు ఎవరని
అధికారులు దాన్ని
వర్షింపచేయలేరని
వర్షము కురిపించి
ప్రాణుల పుట్టించినోడు సృష్టికర్తని
-జ్ఞానం...
ఎప్పుడైనా
ఆలోచించావా
నాటే విత్తనాన్ని
మొలకెత్తించినోడు ఎవరని
విత్తును మొక్కగా
చేసే శక్తి రైతుకు లేదని
చిన్న గింజను మహా
వృక్షముగా మార్చినోడు సృష్టికర్తని
-జ్ఞానం...
54.బ్రహ్మ కన్న విలువైనది ఏదీ
లేదన్నా
బ్రహ్మ కన్న
విలువైనది ఏదీ లేదన్నా
పరబ్రహ్మనే
వేడుకుంటే కలుగును మోక్షమన్నా ఓ ఓ ఓ... బ్రహ్మకన్న...
బ్రహ్మ అనే పదం
సుస్వరాల వేదం
బ్రహ్మ అనే పదం సదా
ప్రణవనాదం
బ్రహ్మ అనే పదం
సృష్టికి మూలాధారం
బ్రహ్మ అనే పదం సమదృష్టికి
కొలమానం
పరబ్రహ్మ సృష్టికి
మూలాధారం
-బ్రహ్మకన్న...
కళ్ళు మూసి
తెరిచేలోగా కదిలిపోయే కాలమిది
ముందు వెనక
నిర్ణయించిన ఆటయిది
పరబ్రహ్మ బోధనలోనే
జీవితం గడపాలి
శాశ్వతమైన ఆ
స్వర్గము స్వంతం కావాలి
పరబ్రహ్మ సృష్టికి
మూలాధారమని తెలుసుకోవాలి
-బ్రహ్మకన్న...
బ్రహ్మ ప్రేమ అనంతం
అది అందరి సొంతం
బ్రహ్మ ప్రేమ
అద్భుతం అది కమ్మని అనుభవం
బ్రహ్మ ప్రేమ
శాశ్వతం అదియే మహిమాన్వితం
బ్రహ్మ ప్రేమ ఆనందం
అది తీయటి మకరందం
పరబ్రహ్మ సృష్టికి
మూలాధారం ఓ ఓ ఓ ..
-బ్రహ్మకన్న...
55. మతాల కొలనులో వికసించే ఈ
సత్యం
మతాల కొలనులో
వికసించే ఈ సత్యం
అజ్ఞానపు చీకటిలో
వెలుగై ఉదయించే ఈ సత్యం
-మతాల కొలనులో...
శ్రీ రాముని
చరితంలో చూడూ
అగోచర దైవాన్ని
ప్రార్ధించే ఈ సత్యం ఈ సత్యం
గీతాచార్యుని
సందేశంలో చూడూ
అవ్యక్తరూపుడైన ఆ
ఈశ్వరుని
తెలుసుకో తెలుసుకో
తెలుసుకో
-మతాల కొలనులో...
సర్వమానవాళిని
మేల్కొలిపే ఈ సత్యం
మానవ లక్ష్యాన్ని
చూపించే ఈ సత్యం ఈ సత్యం
క్రీస్తు సువార్తలో
చూడూ
అద్వితీయుడిని
గుర్తించే ఈ సత్యం
తెలుసుకో తెలుసుకో
తెలుసుకో
-మతాల కొలనులో...
అంతిమ ప్రవక్త
ముహమ్మద్ బోధనలో చూడూ
చరాచర సృష్టికి
మూలాధారం అయిన
ఆ అల్లా: ఆ అల్లా:
తెలుసుకో తెలుసుకో
తెలుసుకో
-మతాల కొలనులో...
56. పరమాత్మే జీవ ఆత్మకు
బోధించిన పిలుపు ఇదే
పరమాత్మే జీవ
ఆత్మకు బోధించిన పిలుపు ఇదే
ఎలుగెత్తే ఆ పిలుపు
ఉత్తమయినది
పిలుపు జగతికి ఓ
మేల్కొలుపు ఓ మేల్కొలుపు
-పరమాత్మే...
ఆదియందు ఆదిత్యునికి
బోధించిన పిలుపు ఇదే
ఆది గురువు
రుషులందరికీ
అందించిన పిలుపు
ఇదే పిలుపు ఇదే
-పరమాత్మే...
పరంపరంగా సాగే
పిలుపే
చరాచర సృష్టికి
నియామకుని పిలుపు
ఏకోబ్రహ్మ అని
పిలిచిన పిలుపు పిలిచిన పిలుపు
-పరమాత్మే...
అక్షరం పరమే
పరమేశ్వరుని నిలయమూ
సర్వజగతిని
సృష్టించిన ఆయనే
ప్రకృతినే తల్లి
ఒడిగా చేసి సర్వజీవులనూ సృష్టిస్తాడు
-పరమాత్మే...
సర్వజీవులకు
రూపమునొసగిన అక్షర స్వరూపుడు
ఏ రూపమూ సాటీ
పోల్చని
ఆనంద స్వరూపుడు
ఆనంద స్వరూపుడు
-పరమాత్మే...
57. ఎందరో దైవాలను కల్పిస్తారు
ఎందరో దైవాలను
కల్పిస్తారు
ఊహలను భ్రమలను
అనుసరిస్తారు
ఆటపాట వినోదాలో
మునిగి ఉంటారు
ఇంతలో ముగిసిపోవు ఈ
జీవితం ఈ జీవితం
-ఎందరో...
సర్వానికి
సృష్టికర్త ఒకడేనంటే
చిత్రమైన వాదనలు
చేస్తుంటారు
విచిత్రమైన వాదనలు
చేస్తుంటారు
సాటిలేని దైవానికి
సాటి చూపుతున్నారు
సాటి చూపుతున్నారు
-ఎందరో...
సృష్టించినోడు
సృష్టింపబడిన వాడు ఒకటి కాగలడా
గ్రంథమందులేని
విశ్వాసం కలిపించకు
మనోవాంఛ కోరికలను
వెంబడించకు
వెంబడించకు
-ఎందరో...
మరణమనే ముసుగువెనుక
మర్మము తెలుసా
మరణమనే ముసుగువెనుక
మర్మము తెలుసా
నిర్ణీవులను
జీవులుగా చేసే రోజు
చేసే రోజు
-ఎందరో...
ఏ బంధమూ రక్షించని
రోజు ఉందని
మరువకు భ్రమలన్నీ
స్వప్నంగా మారే రోజూ
మరువకు భ్రమలన్నీ
స్వప్నంగా మారే రోజూ
మారేరోజూ
-ఎందరో...
58.ఎంత దయగలవాడవో
ఎంత దయగలవాడవో ఓ
సర్వేశ్వరా!
కారుణ్యానికి
ప్రతిరూపం నీవేకదా!
మమకారానికి మరో
పేరు నీవేకదా!
-ఎంత దయగలవాడవో...
రెక్కలపై గాయంచేత
ఎగురలేని పక్షికి
వైద్యుడెవరు
నీవేకదా
సాగరాన పుట్టిన
చిన్న చేపపిల్లకు
ఈతనేర్పు గురువు
నీవే కదా
జీవులపై దయగలవాడా
మాతృహృదయమున్న వాడా
కంటికి రెక్కల
కాచుకునేటి దేవుడు నీవేకదా
-ఎంత దయగలవాడవో...
ప్రసవ వేదనతో
అడవిలోనున్న లేడికి
దిక్కెవరు నీవేనయా
ఆర్తనాదాలు చేస్తూ
నిన్ను వేడుకొనగా
తండ్రివై నిలిచావయా
జీవుల పై దయగలవాడా
మాతృహృదయమున్న వాడా
కంటికి రెక్కల
కాచుకునేటి దేవుడు నీవేకదా
-ఎంత దయగలవాడవో...
పెనుతుఫాను సూచన
చూసి
తల్లడిల్లు
మూగజీవులు నీ వైపే చూసేనయా
ఉరుములలో
మెరుపులాగా
మూగజీవులన్నియూ
నిన్ను అర్ధించేనయా
జీవులపై దయగలవాడా
మాతృహృదయమున్న వాడా
కంటికి రెక్కల
కాచుకునేటి దేవుడు నీవేకదా
-ఎంతదయగలవాడవో...
59.పరిశుద్ధుడా పరిశుద్ధుడా
పరిశుద్దుడా
పరిశుద్ధుడా పరమందు వాసిల్లే పరిశుద్దుడా
పరిశుద్ధుడా
పరిశుద్ధుడా పరమందు వాసిల్లే పరిశుద్దుడా
పరలోక భూలోక
పాతాళలోకాలు
పరియుంచు నాకై
బలవంతుడా
వేయేల గళములతో
ఆ.... ఆ...
వేయేల గళములతో
నిత్యము కొనియాడే
దేవుడవయ
-పరిశుద్దుడా...
వేదభాషలో ఈశ్వరునిగ
నిను పిలుచుకున్నారులే
హెబ్రూ భాషలో
యెహోవాగా నిను తెలుసుకున్నారులే
అరబి భాషలో అల్లాహ్
గా నిను కొలుచు కున్నారులే
మలిన మంటని
మహనీయుడా
పరిశుదుద్ధలకే
పరిశుద్దుడా
-పరిశుద్దుడా...
ఆకాశంనుండి నీ
దివ్య గ్రంథాలు పంపియున్నావులే
నీ ప్రియబోధకులు
వాటిని మాకు వివరించి ఉన్నారులే
ఆ బోధలలో నిను చేరే
మార్గమున్నాదిలే
మలిన మంటని
మహనీయుడా
పరిశుదుద్ధలకే
పరిశుద్దుడా
-పరిశుద్దుడా...
60. స్తుతులందుకో ఆశీనుడా
స్తుతులందుకో
ఆశీనుడా,
స్తోత్రాలకు
యోగ్యుడవు నీవేనయ్యా
ఓ అల్లాహ్, ఓ యెహోవా, ఓ ఈశ్వరా....
-స్తుతులందుకో...
పుట్టించి పోషించే
మారాజువే
క్షమియించి
కరుణించే అధినేతవే
-స్తుతులందుకో...
జగమంత తిరిగినా
కళ్ళు అలసిపోవును
కరుణమయులెవరూ ప్రభూ
నువు తప్ప
కరుణామయులెవరూ
ప్రభూ
కరుణించడంలోన నీకు
నీవే సాటి
క్షమియించడంలోన
నీకు నీవే సాటి
నీకు సమమెవ్వరూ
ప్రభూ నీకు సమమెవ్వరూ
-స్తుతులందుకో...
నీవిచ్చినా గాలి, నీవిచ్చినా నీరు
త్రాగనిదెవరు ప్రభూ, నువుతప్ప త్రాగనిదెవరు ప్రభూ
నీవిచ్చిన గాలి
వెనుకకు తీసుకుంటే,
నీవిచ్చిన నీరు
భూమిలోకి లాగుకుంటే
తిరిగివ్వగలవారెవ్వరు
ప్రభూ, నువుతప్ప
తిరిగివ్వగలవారెవరూ
ప్రభూ
-స్తుతులందుకో...
61. జీవితం అనిత్యము
జీవితం అనిత్యము
కాదురా శాశ్వతము
తెలుసుకో సోదరా ఈ
నగ్న సత్యము
ఉండరెవరు ఈ లోకాన
నిత్యం
తప్పదయ్యా అందరికీ
మరణము
-జీవితం అనిత్యము..
ఆశలన్నీ ధారబోసి
పెంచిన సంతానం
శ్రమలన్నీ
వెచ్చించి పోగుచేసి సంపద
వెంటరాదు బంధువులు
వెంటరావు ధనరాశులు
అలలలాంటి కలలతో
కరిగిపోయె జీవితము
క్షణభంగురం ఈ
జీవితం గుర్తించు పరమార్థము
-జీవితం
అనిత్యము...
స్త్రీలు, సంతానం విడలేని అనుబంధం
వెండి బంగారమూ
ఆకర్షణ హంగులు
మురిసిపోవద్దు అవి
శాశ్వతమనుకొని
వెళ్లి పోవాలి
వాటిని విడిచి వీడి పోతాయి అవి నిన్ను
క్షణభంగురం ఈ
జీవితం గుర్తించు పరమార్థము
-జీవితం అనిత్యము...
కాలము సాక్షిగా
నష్టంలో ఉన్నారు మానవులు
పరలోక శిక్షగా
రానున్నాయి తీర్పు గడియలు
మేలుకో సోదరా మరణము
రాకముందే
గుర్తించు
పరమార్థము యాతన చుట్టక ముందే
క్షణభంగురం ఈ
జీవితం గుర్తించు పరమార్థము
-జీవితం అనిత్యము..
జననం నీకిచ్చిన
వాడు మరణం నీకిచ్చిన వాడు
జనన మరణాలు
లేనివాడు సృష్టికర్త ఒక్కడే
గుర్తించు
సృష్టికర్తను ఈ లోకం వీడకముందే
పొందుశాంతి ఈ లోకాన
దొరుకు మోక్షము పరలోకాన
క్షణభంగురం ఈ
జీవితం గుర్తించు పరమార్ధము
-జీవితం అనిత్యము..
62. విడిపోని
స్నేహమా!
విడిపోని స్నేహమా
వీడ్కోలు చెబుతున్నా
విడలేని బంధమా
వీడ్కోలు చెబుతున్నా
గానమై గొంతులో
ప్రాణమై గుండెలో
శ్వాస ఆగిపోయే వరకు
శాశ్వతంగా నిలవాలి
సుమా
-విడిపోని
స్నేహమా...
కలిసి ఉన్న కాలమంత
టి ఎం సి ప్రాంగణమంతా
మనకు ఉన్న బంధాన్ని
పాటనై పాడుతున్నా
మధురమైన ఈ క్షణాలు
మరువలేము జీవితాంతం
ఆగలేక వెళ్లలేక వీడిపోయే
సమయంలో
వీడిపోక తప్పదులే
వెళ్లిపోక తప్పదులే
-విడిపోని
స్నేహమా...
గడిచిపోయె శిక్షణ
కాలం కనురెప్పలు వేయకముందే
మిగిలిపోయే
జ్ఞాపకాలు చివరి శ్వాస పీల్చెవరకు
రాకముందు ఎవరికి
ఎవరో ఇపుడేమో వీడని బంధం
బంధాలను తెంచుకొని, బాధ్యతలను
పంచుకొని
వీడిపోక తప్పదులే వెళ్లిపోక
తప్పదులే
-విడిపోని
స్నేహమా...
అజ్ఞానులుగా అడుగువేసి
విజ్ఞులుగా వెనుతిరిగాము
పామరులను పండితులుగా
మార్చివేసే ఈ శిక్షణ కాలం
గ్రంథాలను బోధిస్తూ
నిజధర్మం చాటుదాము
వాడవాడలా సత్యం
మానవాళికి చేరవేద్దాం
కన్నీరు కారుతున్నా
మనసెంత కాదనుకున్నా
స్వర్గంలో కలుస్తామని
వీడిపోక తప్పదులే
వెళ్లిపోక తప్పదులే
-విడిపోని
స్నేహమా...
63. కదిలింది నా నావ నీ పేరుతో
హైలెస్సా హైలెస్స
హైలెస్సా ఓ సర్వేశ్వరా!
కదిలింది నా నావ నీ
పేరుతో
ఒడ్డుకు చేరింది నా
నావ నీ ప్రేమతో
నీ వెంత
కరుణామయుడవు... నీ వెంత కృపాశీలుడవు
-సర్వేశ్వరా...
నీటి నుండి
జీవమిచ్చు నా స్వామివే
భూమినుండి
ఉపాధినిచ్చు నా ప్రభువువే
నింగినుండి
వెలుగునిచ్చు నా దైవమే
చీకటిలో దారి చూపె
మార్గదర్శివే
-సర్వేశ్వరా...
ఏ పేరున నిను
పిలిచెదనయ్యా
ఏ విధముగా నిను
కొలిచెదమయ్యా
సర్వేశ్వరా, యెహోవా, అల్లాహ్
ఏ భాషలో పిలిచినా
నా స్వామిలే
-సర్వేశ్వరా...
మా హృదయాలు తెరిచేటి
నా స్వామివే
నా ఊహలను ఎరిగేటి
సూక్ష్మద్రష్టవే
జననమరణాలు లేని
సృష్టికర్తవే
కంటికి కానరాని
అవ్యక్తుడివే
అందనంత ఎత్తులో
పరమందున్న పరబ్రహ్మవే
-సర్వేశ్వరా...
64. సింహాసనుడు, పురాతనుడు...
సింహాసనుడు, పురాతనుడు
విశ్వాన్ని సృష్టించిన
ఆ ఘనుడు
సర్వ జీవుల శిల్పి
అక్షర పరబ్రహ్మ
జీవాత్మను
సృష్టించే పరంధాయుడు
-సింహాసనుడు...
భూమిని పాన్పుగా
చేసినవాడు
ఆకాశాన్ని కప్పుగా
ఉంచినవాడు
పర్వతాన్ని భూమిపై
పాతినవాడు
సముద్రాన్ని
నిలుపుదల చేసినవాడు
-సింహాసనుడు...
ఎగిరే పక్షులను
రూపొందించినవాడు
బలమైన జంతువులను
సృజించినవాడు
జ్ఞానాన్ని మనిషికి
ప్రసాదించినవాడు
ప్రకృతినంతటిని
ఆధీనం చేసినవాడు
-సింహాసనుడు...
పగటిని రేయిని
నిలిపిన వాడు
సూర్యచంద్రులకు
వెలుగును ఇచ్చినవాడు
గాలిని, నీటిని పారించినవాడు
దైవశక్తి గొప్పదని
చాటినవాడు
-సింహాసనుడు...
65. సత్యధర్మాన్ని బోధించే
పిలుపు ఇదే
సత్యధర్మాన్ని
బోధించే పిలుపు ఇదే
సనాతన ధర్మాన్ని
బోధించే పిలుపు ఇదే
పురాతన దైవాన్ని
గుర్తించే ప్రకటన ఇదే
దైవ శాస్త్రంపై
నడిపించే మార్గం ఇదే
-సత్యధర్మాన్ని...
వేద శాస్త్రాలు
అందించే జ్ఞానం ఇదే
కార్యాకార్యాలు
నిర్ణయించే ఆజ్ఞ ఇదే
రాయబడి ఉన్నది
ఇహలోక జీవితం
నీ చేతిలో ఉన్నది
పరలోక సాఫల్యం
-సత్యధర్మాన్ని...
విశ్వ్యవస్థను
సృష్టించినవాడు ఆ దైవమే
జనన మరణాలు
నిర్ణయించేది ఆ దైవమే
సర్వస్తోత్రాలకు అర్హుడు
ఆ దైవమే
సమస్త స్తుతులకు
పాత్రుడు ఆ దైవమే
-సత్యధర్మాన్ని...
జనన మరణాలు
లేనివాడు అవ్యక్తరూపుడు
సకల చరాచర సృష్టికి
మూలాధారుడు ఆ దైవమే
ఆదినుండి గ్రంథాలను
పంపించినోడు ఆయనే
మనుషులకు సన్మార్ధం
చూపించినోడు ఆయనే
-సత్యధర్మాన్ని...
66. కాదు శాశ్వతం ఈ జీవితం
కాదు శాశ్వతం ఈ
జీవితం
క్షణ భంగురమని
గ్రహించు ఓ మనిషి
బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము
తప్పదులే ఈ దశల
తరువాత మరణము
-కాదు శాశ్వతం...
బుడి బుడి నడకలతో
వడివడి అడుగులతో
నడిపించేవాడు
ఒకడున్నాడని గ్రహించు
దైవజ్ఞానం లేని
జీవితం జీవం లేని బొమ్మరా
వ్యర్థమే అలాంటి
జీవితం వాస్తవం గ్రహించరా
-కాదు శాశ్వతం...
అందమైన ఈ దేహం చూసి
మురిసేవు ఎందుకురా
మూడునాళ్ల ముచ్చటేననే
వాస్తవాన్ని తెలుసుకో
నీటి బుడగరా జీవితం
క్షణభంగురం తెలుసుకో
గ్రంథం జ్ఞానం
లేకపోతే అంధకారమీ ప్రయాణం
-కాదు శాశ్వతం...
మనిషిగా పుట్టిన
నీకు యోచించే జ్ఞానం ఉన్నదిలే
గ్రంథాల అనుసరణే
మోక్షము నీకు ఇచ్చునులే
గీత, బైబిల్, ఖురాన్ల దృక్పథాన్ని
తెలుసుకో
సర్వేశ్వరాజ్ఞలను
తెలుసుకొని జీవితాన్ని సరిదిద్దుకో
-కాదు శాశ్వతం...
67. మనుషులు చేసిన ఈ ప్రతిమ
మనుషులు చేసిన ఈ
ప్రతిమ
దేవుడు ఎలా అవుతాడు
దేవుడు మనిషిని
చేసాడు
మనిషే దేవుడు
అవుతాడా?
-మనుషులు చేసిన...
దేవుడు మనిషిని
చేసి జీవం పోశాడు
అందమైన ఆకారంలో
నిలబెట్టాడు
సృష్టించిన
సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి
ఆ సృష్టికర్త
పరమందున్నాడని విశ్వసించాలి
-మనుషులు చేసిన...
ప్రకృతిని
రూపొందించి జీవం పోశాడు
ప్రకృతిని చూసి
సృష్టికర్తను గ్రహించు
విశ్వవ్యవస్థను
చూసి, సూర్యచంద్రులను చూసి
తెలుసుకో ఆ
సర్వేశ్వరుని, మానవ జీవిత లక్షాన్ని
-మనుషులు చేసిన...
సర్వశక్తిగల దేవుడు
సర్వానికి నియామకుడు
మానవులతో ఆయన
సమానమెలా అవుతాడు
పరమందున్న
పరమదైవాన్ని మరువకు
అగోచరుడైన ఆయనకు
ఆకారాన్ని కల్పించుకు
-మనుషులు చేసిన...
68. మారాలి ఈ సమాజం
సమాజం ఈ సమాజం
మారాలి ఈ సమాజం
దుర్మార్గాలు, దౌర్జన్యాలు అంతం కావాలి
శాంతి సమభావన
వృద్ధి చెందాలి
నైతికత, ఐక్యత, మతసామరస్యం వెల్లివిరియాలి
-సమాజం...
అశాంతి అలజడులు
అలవాలం అయ్యాయి
తాగుడు జూదం లంచాలు
పెరిగిపోయాయి
దౌర్జన్యాలు, దోపిడి కులమత ఘర్షణలు
ఎటు వెళ్తుంది ఈ
సమాజం
-సమాజం...
గీత బైబిల్ ఖురాన్
గ్రంథాలలో
మహనీయులు ఎందరో
బోధించారు
సృష్టికర్త
ఆజ్ఞపాలనే సమాజసంస్కరణ
దైవభీతి ఒక్కటే
మార్పులు తెచ్చే వేదిక
-సమాజం...
69. భీకరమైనది
ఆ రోజు
భీకరమైనది ఆ రోజు
ప్రళయం వచ్చే రోజు
భయాందోళనలతో ప్రతి
మనిషి
పరుగులు తీసే రోజు
-భీకరమైనది...
ఆకాశం బ్రద్దలై
నక్షత్రాలు చెదిరినప్పుడు
ఉరుములు మెరుపులతో
ప్రతిధ్వనించే ఆ రోజు
సముద్రాలు
మండించబడి సూర్యుని కాంతి తగ్గినప్పుడు
కర్మలు గుర్తొచ్చి
ప్రతి గుండె రోదించే ఆ రోజు
-భీకరమైనది...
పెనుగాలులు, భీకరమైన
భూకంపాలు
పర్వతాలు గాలిలో
ఎగిరిపోయే ఆ రోజు
పాలు తాగే పసికందును
వదిలి పారిపోయే తల్లులు
గర్భాలు సయితం
విచ్చిన్నం చేసుకునే నిండు చూలాలు
విచ్చుకున్న కళ్లు
విచ్చుకుని ఉండిపోయే ఆరోజు
-భీకరమైనది...
70. మారు మనస్సు పొందిన ఓ మనిషి
మారు మనస్సు పొందిన
ఓ మనిషి
మారిందా నీ మనసు
మారిందా
తండ్రి అయిన దేవుడు
ఒక్కడే అని తెలిసిందా
ఆయన
పరలోకమందుంటాడని తెలిసిందా
-మారుమనస్సు...
ఆకాశం యందుగాని, భూమియందుగాని
నీళ్లయందుగాని
హృదయమందుగాని
దేవునికి రూపాలు
కల్పించకూడదని తెలిసిందా
వాటి ముందు
సాగిలపడకూడదని తెలిసిందా
-మారుమనస్సు...
పరిశుద్ధ గ్రంథంలో
రాయబడి ఉన్నది
సర్వానికి
సృష్టికర్త ఒక్కడేనని
దేవునికి నరులకు
మధ్యవర్తి ఒక్కడేనని
ఆయనే నరుడైన యేసు అని
తెలిసిందా
-మారుమనస్సు...
దేవునితో ఎవ్వరినీ
పోల్చకూడదని
ఏ రూపం ఆయనకు సాటి
చేయకూడదని
దేవుని చూసిన ఏ
నరుడు బ్రతకలేడని
ధర్మశాస్త్రములో
రాయబడి ఉన్నదని తెలిసిందా
-మారుమనస్సు...
71. కలలాంటి జీవితం
కలలాంటి జీవితం
కలకాలము ఉండదులే
నీడవంటి జీవితము
నిను వీడిపోవునులే
కళ్లు మూసి
తెరిచేలోగా ముగిసిస్తోయే జీవితము
కళ్లు మూత పడకముందే
తెలుసుకో
-కలలాంటి జీవితం...
ప్రతి మనిషికి
ఆశలున్నవి అవి సాధ్యముకావు
నింగికి నిచ్చెన
వేయకు నింగికి నీవు ఎదగలేవు
విర్రవీగుతూ నడవకు
నేలను నీవు చీల్చలేవు
పొందలేని ఆశలతో
మట్టిలో నీవు కలిసి పోతావు
-కలలాంటి జీవితం...
పెంచుకున్న సంపదలు
పెనవేసుకున్న బంధాలు
ఏవి శాశ్వతముకాదు
ఎవరు నిత్యము ఉండరు
తెలుసుకో ఈ సత్యం
నీ లెక్కలు చూడకముందే
చేసిన కర్మలకు
దైవసన్నిధిలో సమాధానం చెప్పాలి
-కలలాంటి జీవితం...
ఎవరి పేరుతో నీవు
హక్కులు కోరుకుంటావో
ఆ పైవాడు ఒక్కడని, సర్వసృష్టికర్తయని తెలుసుకో
శక్తిమంతుడైన ఆయనకు
సాటి సమానమెవ్వరు లేరు
గ్రహిస్తే ఈ సత్యం కలుగును
సాఫల్యం లేకుంటే వైఫల్యం
-కలలాంటి జీవితం...
72. ఈ చరాచర సృష్టికి సృష్టికర్త ఒక్కడే
ఈ చరాచర సృష్టికి
సృష్టికర్త ఒక్కడే
సృష్టిని
సృజించినోడు ఒక్కడే
సృష్టిని నడిపించేవాడు
ఒక్కడే
ఒక్కడే ఒక్కడే
మనందరికి సృష్టికర్త ఒక్కడే
-ఈ చరాచర...
భూమి ఆకాశాలు తెలుపుతున్నాయి
సృష్టికర్త ఒక్కడేనని
సూర్యచంద్రులు
ప్రకటిస్తున్నాయి సృష్టికర్త ఒక్కడేనని
రాత్రిపగలు చెబుతున్నాయి
సృష్టికర్త ఒక్కడేనని
విశ్వవ్యవస్తను
చూసి తెలుసుకో ఈ సత్యం ఓ మనిషి
-ఈ చరాచర...
జనన మరణాలు
తెలుపుతున్నాయి సృష్టికర్త ఒక్కడేనని
అన్న పానీయాలు తెలుపుతున్నాయి
సృష్టికర్త ఒక్కడేని
పండే పంటలు తెలుపుతున్నాయి
సృష్టికర్త ఒక్కడేనని
జీవన వ్యవస్థను
చూసి గ్రహించు ఈ వాస్తవం ఓ మానవా
-ఈ చరాచర...
వేదోపనిషత్తులు
బోధిస్తున్నాయి సృష్టికర్త ఒక్కడేనని
భగవద్గీత సారములో
ఉంది సృష్టికర్త ఒక్కడేనని
బైబిల్, ఖురాన్ల ఉద్భోధ సృష్టికర్త ఒక్కడేనని
గ్రంథాల అధ్యయనం
చేసి జ్ఞానిగా మసలుకో
-ఈ చరాచర...
73. దేవుడు ఒక్కడే సృష్టికి
కర్త ఒక్కడే
దేవుడు ఒక్కడే
సృష్టికి కర్త ఒక్కడే
ఈ చరాచర సృష్టికి
నియామకుడు ఒక్కడే
పంచభూతాలను
విశ్వంలో సృష్టించినవాడు
ప్రకృతులను అందంగా
ఏర్పరచినవాడు
-దేవుడు ఒక్కడే...
భూమి ఆకాశాలను
నియమించినవాడు ఒక్కడే
సూర్యచంద్రుల గమనాలను
నిర్దేశించినవాడు ఒక్కడే
సమస్త జీవరాశులను
పాలించి పోషించేది ఒక్కడే
సృష్టి నియమాలను
గమనించి తెలుసుకో ఓ మనిషీ
-దేవుడు ఒక్కడే...
ఇహలోక సుఖశాంతులను
ఇచ్చేది ఒక్కడే
పరములో శిక్షా
బహుమానాలు ఇచ్చేది ఒక్కడే
ప్రవక్తలను
గ్రంథాలను పంపింది ఆయనే
దైవగ్రంథాలను చదివి
తెలుసుకో ఓ మనిషీ
-దేవుడు ఒక్కడే...
జననమరణాలకు అతీతుడు
సర్వేశ్వరుడు ఒక్కడే
అవ్యక్తరూపుడు, పరమందుండువాడు పరబ్రహ్మ ఒక్కడే
తెలుసుకొని
ఆచరిస్తే కలుగును ఇహపర సాఫల్యం
విశ్వసించు వాస్తవం
తెలుసుకొని ఓ మనిషి
-దేవుడు ఒక్కడే...
74. ప్రపంచవ్యామోహంలో ఉన్న ఓ
మనిషీ
ప్రపంచవ్యామోహంలో
ఉన్న ఓ మనిషి
యోచించు నిను
మనిషిగా పుట్టించాడెందుకని
ఆలోచించు మానవ
జీవిత లక్ష్యం ఏమిటని
తెలుసుకో సమస్త
సృష్టికి కర్త ఒకడని
-ప్రపంచవ్యామోహంలో...
బాల్యములో ఆటపాటలతో
గడిపావు
యవ్వనంలో
కామక్రోథాలతో సాగావు
వృద్ధాప్యంలో
కూర్చుని దుఖిస్తున్నావు
నీవు చేసే
కర్మఫలితమే నీ వెంట వస్తుంది
-ప్రపంచవ్యామోహంలో...
బాల్యంలో తెలుసుకుంటే
భాగ్యాలెన్నో పొందుదువు
యవ్వనంలో తెలుసుకుంటే
శాంతిసుఖాలు పొందుదువు
వృద్ధాప్యంలో నిజ
జీవన గమ్యమును చేరుదువు
సృష్టికర్తను
తెలుసుకొని ఆయననే ధ్యానించాలన్నా
-ప్రపంచవ్యామోహంలో...
విద్యను పొందడానికి
పాఠాలెన్నో చదివావు
వృద్ధి వికాసాలకోసం
పరిశోధనలే చేసావు
జ్ఞానార్జన కొరకు
పరిశీలనలు చేసావు
సాఫల్యం పొందడానికి
దైవగ్రంథాలే చదవాలి
–ప్రపంచవ్యామోహంలో...
75. నీవుండ నాకు భయమేలనోయి
నీవుండ నాకు
భయమేలనోయి
సర్వశక్తుడా నీ
ఆజ్ఞ వెంబడి నే నడువగా
పిడుగులు పడినా
పెనుతుఫానులు చూసినా
జడువనయ్యా నిను
ఎడబాయనయ్యా
-నీవుండ
నాకు...
నింగిన తారలు నేల
రాలినా
సాగర జలములే
ఇంకిపోయినా
తరగని ప్రేమకు
గురుతువు నీవయా
చెరగని ముద్రను
వేసినావయా
-నీవుండ
నాకు...
విశ్వాసపు నావ సాగు
వేళ
సాతాను సుడులే
రేపిన వేళ
వడివడిగా నేను
ముందుకు సాగేదా
నీ వాక్యముతో
బలమును పొందగా
-నీవుండ
నాకు...
నీవుండ నాకు
భయమేలనోయి
సర్వశక్తుడా నీ
ఆజ్ఞ వెంబడి నే నడువగా
పిడుగులు పడినా
పెనుతుఫానులు చూసినా
జడువనయ్యా నిను
ఎడబాయనయ్యా
-నీవుండ
నాకు...
76. భువిలో
పుట్టిన మానవులు...
భువిలో పుట్టిన
మానవులు దైవాలవుతారా
పరమున ఉన్న
పరబ్రహ్మ మానవుడవుతాడా
తెలుసుకో వాస్తవం
తెలుసుకొని మసలుకో
-తెలుసుకో
వాస్తవం...
తల్లి గర్భంలో
నవమాసాలు
సర్వేశ్వరుడు
నివాసముంటే
సృష్టిస్థితిలయల
నిర్వహణలు
చిన్నా భిన్నం
అవుతాయి గతులు తప్పిపోతాయి
-తెలుసుకో
వాస్తవం...
తల్లిదండ్రులు భార్యాపిల్లలు
పరబ్రహ్మ కలిగి ఉంటే
వారసత్వపు అలజడులు
రగిలిపోతే
విశ్వ్యవస్థ
వినాశమే అవుతుంది
సృష్టి మొత్తం
అస్తవ్యస్తం అవుతుంది
-తెలుసుకో
వాస్తవం...
జననమరణాలకు అతీతుడు
ఆ సృష్టికర్త
సర్వశక్తిమంతుడు
స్వయంభవుడు ఆయనే
అవ్యక్తుడు
సర్వానికి నియామకుడు ఒక్కడే
గ్రహించు ఈ నిజం
ఇదే జీవిత పరమార్థము
-తెలుసుకో
వాస్తవం...
77. సనాతన
ధర్మములో....
సనాతన ధర్మములో
అనాదిరూపుడు
ఆరాధనీయుడు
అక్షరపరబ్రహ్మ ఒక్కడే
వేదోపనిషత్తులు
చెప్పే సారము
శ్రీకృష్ణుడు
బోధించిన గీతాశాస్త్రము
-అక్షరపరబ్రహ్మము
ఒక్కడే...
తండ్రి ఒక్కడే
గొప్పవాడు అని యేసు చాటిన
అల్లాహ్ యే
ఆరాధనీయుడు అని ముహమ్మదు చెప్పిన
అడవిలో యుద్ధములో
రాముడు ప్రార్థించి ప్రకటించినా
వారందరి బోధనా
సారాంశము ఒక్కటే
-అక్షరపరబ్రహ్మము
ఒక్కడే...
రుషుల బోధనలు
ప్రపక్తల ఆదర్శము
సజ్జనుల మాటలు
సత్పురుషుల బాటలు
పరలోక
నిత్యజీవానికి సోపానములు
వారందరి మార్గమే
మనకు సాఫల్యము
-అక్షరపరబ్రహ్మము
ఒక్కడే...
78. అనంతకోటికి...
అనంతకోటికి భవసాగరం
ఒక్కటే
జగమంతా ఒక్కటే
సృష్టికర్త ఒక్కడే
కష్టసుఖాలు
భవబంధాలు పరీక్షసాధనాలు
నడి సముద్రాన
నావలాంటిది నీ రహదారి
-అనంతకోటికి...
ఉత్తముని కడుపున
జన్మించినా
గొప్ప కులమున
సంబందము కలిగినా
విశ్వాస మతమెంతయో
పేరు గాంచినా
సృష్టికర్తను
గ్రహించని జీవితము వ్యర్థమాయె
-అనంతకోటికి...
పూజకన్నా మనిషి
బుద్ధి గొప్పది
మాటకన్నా మనసు
మిగుల గొప్పది
మనసులో రగిలేటి
విశ్వాసము గొప్పది
సృష్టికర్త ఒక్కడే
అని పదిలపరిచే విశ్వాసమే గొప్పది
-అనంతకోటికి...
79. ఎవరూ
నాకు లేరని...
ఎవరూ నాకు లేరనీ
దిగులుపడిన వేళలలో
నీ తోడై ఉంటానంటూ
నా వెన్ను తట్టావూ
నీ నీడను నేనేనంటూ
నా చెంత నిలిచావూ
-ఎవరూ
నాకు లేరనీ...
అమ్మను మించిన
కమ్మని ప్రేమా నీలో ఉన్నదనీ
నన్ను చేసినా
కుమ్మరి నీవని నిన్నే నమ్మితినీ ...ఆ..
నీవే నీతికి రూపమనీ
నీ సత్యము ఇలలో ప్రకటించే
ఆశను నాలో నింపిన
నీవే కృపగల దేవుడవూ
-ఎవరూ
నాకు లేరనీ...
అజ్ఞానంలో బ్రతికే
నాకూ ధర్మము బోధించే
సత్యవంతుడూ
నీవేనంటూ జ్ఞానం నేర్పితివే...ఆ...
యేసును క్రీస్తుగ
పంపించీ మాదిరి నాకూ చూపించీ
మరణము నుండీ
జీవంలోనికి నడిపిన జీవన దాతవూ
-ఎవరూ
నాకు లేరనీ...
80. యోమామ
జమనాదిం...
యోమామ జమనాదించ చ
వేత్తి లోకమహేశ్వరమ్
అసమ్మూడస్స
మర్యేరేషు సర్వపాపై ప్రముచ్ఛతే
పుట్టుకలేనివాడూ
సర్వేశ్వరుడూ దేవుడూ
మరణం లేనివాడూ
మహిమా పూర్ణుడు మాధవుడూ
సర్వము నెరిగినవాడూ
సర్వోన్నతుడు ఆయనే
సర్వకాలము నీతో
నిలిచీ నడిపించే అధినాయకుడూ
-పుట్టుక
లేనివాడు...
అవ్యక్త
వ్యక్తిమాపన్నం మన్యన్డే మామ బుద్ధయః
పరం భావమజానన్తో
మమావ్యయ మనుత్తమమ్..ఆ..
కనిపించని వాడూ
కనికర సంపన్నుడూ
కష్టాలన్నీ కడతేర్చే
కరుణామయుడు అతి ప్రియుడూ
అవ్యక్త రూపుడు ఈ
లోకాతీతుడు
భౌతిక దేహము
పొందనివాడు భగవంతుడు మనకున్నాడూ
-పుట్టుక
లేనివాడు...
మయా తతమిథం సర్వం
జగదవ్యక్త మూర్తినా
మత్ సాని
సర్వభూతాని చాహం తేశ్వవస్థితః
పోలిక లేనివాడూ మరి
దేనిని పోల్చుకోడూ
సర్వమంతా వ్యాపించీ
జగతిని ఏలే దేవుడూ
నీలో ఉన్నాడూ
సృష్టికర్త నీతో ఉన్నాడు
మనసుతో ఆరాధించి
మోక్షము పొందుము నేడు
-పుట్టుక
లేనివాడు...
81.దేవుడు
చేసిన మనిషీ...
దేవుడు చేసిన మనిషీ
ఆ దేవుని బొమ్మగ చేశాడూ
సృష్టికర్తను
వదిలేసీ ప్రకృతియే తన దైవమనీ
ఆరాధించాడూ దేవుని
ఆజ్ఞను మీరాడూ
-దేవుడు చేసిన...
రామాలయమను
నిర్మించీ రామతత్వమే మరిచాడూ
కృష్ణుని లీలలు
భజయించే గీత బోధనే వదిలేశాడూ
వేదాలన్నీ దాచేసి
సొంత తెలివితో పూజించి
ఆరాధించాడూ దేవుని
ఆజ్ఞను మీరాడూ
-దేవుడు చేసిన...
సుందరమైనా మందిరాలకు
కోట్ల సొమ్మును వెచ్చించీ
యేసయ్య మార్గము
వదిలేసి
దేవుని భయమును
విడిచాడూ
బైబిల్ వాక్యము
ఒకటైతే సొంత తెలివిలో బోధించీ
ఆరాధించాడూ దేవుని
ఆజ్ఞను మీరాడు
-దేవుడు చేసిన...
మసీదులను
నిర్మించాడూ ముహమ్మద్ బోధను మరిచాడూ
సమాధులను
అర్థించాడూ సమానత్వమే విడిచాడూ
సృష్టికర్తనే
వదిలేసి దాసులనే తన దైవం చేసి
ఆరాధించాడూ దేవుని
ఆజ్ఞను మీరాడూ
-దేవుడు చేసిన...
82.దేవుడు
పంపిన మహనీయులు...
దేవుడు పంపిన
మహనీయులందరు జ్ఞాపకమున్నారా
వారి బోధలు
విన్నారా
ధన్యజీవులై దేవుని
రాజ్యము చేరుకున్నారూ
తమ జీవితాలను
స్ఫూర్తిగా మనకుంచి వెళ్లారూ
-దేవుడు
పంపిన...
త్రేతాయుగమలో
రాముడు పుట్టాడూ
తండ్రిమాటనూ
జవదాటనివాడూ
సవతి తమ్ములను
ప్రేమించేవాడూ
సర్వజనులకూ
ఆదర్శవంతుడూ
దేవుడు పంపినవాడూ
మానవులలో మహనీయుడూ
వారు చూపినా దారిలో
నీవు సాగుము సోదరా
-దేవుడు
పంపిన...
ద్వాపరయుగములో
కృష్ణుడు పుట్టాడూ
దేవుని ప్రేమను
ధరణికి పంచాడూ
భగవద్గీతను జగతికి
బోధించీ
సకల సృష్టికే
గురువై నిలిచాడూ
దేవుడు పంపిన
వాడూ... సకల గుణాలలో ఉత్తముడూ
వారు చూపినా దారిలో
నీవూ సాగుము సోదరా
-దేవుడు
పంపిన...
ఈ కలియుగములో
యేసయ్య పుట్టాడూ
సత్య సువార్తను
ప్రేమతో పంచాడూ
ప్రేమకు రూపం దైవం
అన్నాడూ
ఒకరిని ఒకరు
ప్రేమించమాన్నాడూ
దేవుడు పంపిన వాడూ
సర్వసృష్టికే వెలుగైనాడూ
వారు చూపినా దారిలో
నీవూ సాగుము సోదరా
-దేవుడు
పంపిన...
83. కులం
కట్లు తెంచుకొని...
కులం కట్లు
తెంచుకొని మతం మత్తు తొలగించి
రావోయి నేస్తమా
ధర్మాన్ని చాటింపా
రావోయి నేస్తమా సత్యాన్ని
బోధింపా
-కులం
కట్లు...
వేదాల్లో చెప్పినా
గీతను చదివే
శిధిలమైన
జీవితాన్ని మార్చుకోవా
బైబిల్లో బోధించిన
సత్యము నెరిగీ
గతితప్పిన నీ
బ్రతుకును దిద్దుకోవా
అరారో... అరారో...
అరారో... అరారో....
-కులం
కట్లు...
ఖురానులో చెప్పినా
సమానత్వమూ
ఒక్కడే దేవుడనే ఏక
హృదయమూ
కలిగుంటే చాలునయా
పరలోకమూ
బ్రతుకులోన
పాటిస్తే నిత్యజీవమూ
అరారో... అరారో...
అరారో... అరారో...
-కులం
కట్లు...
ఒకరినొకరు
ప్రేమిస్తే మేలు కలుగునూ
మేలైనది చేయకుంటే
నిత్యనరకమూ
కులం కుళ్లు
విడిచిపెట్టి కళ్లు తెరుచుకో
మతం కాదు మార్గమని
నిజం తెలుసుకో
సత్యమేదో
తెలుసుకొని సృష్టికర్తలో సాగిపో
అరారో... అరారో
అరారో... అరారో...
-కులం
కట్లు...
84. సత్య
వేద గ్రంథాలను...
సత్యవేద గ్రంథాలను
పరిశోధించే
సత్యమైన దేవుడినే
ప్రకటించేవారూ
ధన్యులూ...
ధన్యులూ... ధన్యులూ.... ధన్యులూ...
-సత్యవేద...
వేదాల్లో చెప్పినా
ఒక్క దేవుడే
బైబిల్లో ప్రకటించే
ఒక్క దేవుడే
ఖురానులో బోధించే
ఒక్క దేవుడే
సర్వాన్ని
సృజియించిన ఒక్క దేవుడే
సత్యమని చాటి
చెప్పి మార్గమునూ చూపినోళ్లు
ఆదేవుని దృష్టిలో
ధన్యులూ ఆదేవునిదృష్టిలోధన్యులూ
-సత్యవేద...
పుట్టుక లేనివాడు
దేవుడేననీ
మరణము లేనివాడు
దేవుడేననీ
కనిపించని వాడు మన
దేవుడేననీ
రూపమంటు లేనివాడు
దేవుడేననీ
మత భేదం లేకుండా
తత్వాన్ని చెప్పినోళ్లు
ఆదేవుని దృష్టిలో
ధన్యులూ ఆదేవునిదృష్టిలోధన్యులూ
-సత్యవేద...
లోకంలో పుట్టినా
మహనీయులు
నిజదేవుని
ప్రకటించిన ధన్యజీవులూ
మాదిరిగా వచ్చినా
మధ్యవర్తులూ
మనకొరకు మార్గమును
ప్రకటించేవారినీ
గురువులుగా
గుర్తించి అనుసరించి చూపినోళ్లు
ఆదేవుని దృష్టిలో
ధన్యులూ ఆదేవునిదృష్టిలోధన్యులూ
-సత్యవేద...
85. ఒంటరిగా వచ్చావూ...
ఒంటరిగా వచ్చావూ
ఒంటరిగా వెళ్లేవూ
ఈ లోకం స్థిరమే
కాదురా ఓ మానవా
నీతోటి ఎవరూ రారురా
నీ దేవుడే నీకూ తోడురా
-ఒంటరిగా...
జీవితమెంతో చిన్నది
మంచులా కరిగిపోయేదీ
ఏ క్షణమైనా నిను
వదిలి కనుమరుగవుతుందీ
క్షయమైపోయే నీ దేహం
స్థిరమని మదినే ఎంచాడు
శాశ్వతమైనా
వెలుగొందాలి చీకటి చెంతకు చేరకు
ఓ నేస్తమా..
ఆలకించుమా...నీ గ్యమం ఎవరికో గమనించుమా
నీ గమ్యం ఏ దరికో
గమనించుమా...
-ఒంటరిగా...
కన్నవారు నీకున్ననూ
కన్న బిడ్డలే ఉన్ననూ
ఎన్నివేల సిరి
సంపదలున్నా అంతము ఆగేనా
అన్నదమ్మలే ఉన్ననూ
అయినవారు నీకున్ననూ
కట్టుకున్న నీ
తాళిబంధమూ ప్రేమతో ఆపేనా
జీవితమే
క్షణభంగురమూ చివరికి శూన్యమూ
మరణమే మనిషికి
అంతమూ ఇదియే సత్యమూ
ఓ నేస్తమా...
ఆలకించుమా... నీ గ్యమం ఎవరికో గమనించుమా
నీ గమ్యం ఏ దరికో
గమనించుమా...
-ఒంటరిగా...
నిత్యము నీతో
ఉండేది నిరతము నీతో నడిచేదీ
నీడగ నిన్నే కాచేదీ
నీ ప్రియ దేవుని సన్నిదీ
కరుణను నీపై
చూపించే ప్రేమను పంచేదీ
విడువనిదీ
ఎడబాయనిదీ దేవుని ప్రేమదీ
ఓ నేస్తమా....
ఆలకించుమా... నీ గ్యమం ఎవరికో గమనించుమా
నీ గమ్యం ఏ దరికో
గమనించుమా
-ఒంటరిగా...
86. అయ్యో
వేషధారులారా...
అయ్యో...
వేషధారులారా...
భక్తి వేషము
ధరించినా బోధకులారా
నీతి ముసుగును
ధరించినా పండితులారా
ఎన్నాళ్లు దేవునితో
భక్తి నాటకం
ఎన్నేళ్లు భుక్తికై
దోపిడి జీవితం
నిజమైన దేవునీ
మరచిపోతిరే
ఇహలోక ఆశలకూ
లొంగిపోతిరే
-అయ్యో
వేషధారులారా...
మతంలో కలుపుటకూ
ఆరాటపడతారూ
మతం కాదు దేవుని
మాటని తేల్చిచెప్పరూ
న్యాయమునూ వదిలేసి
కనికరమును కాల్చేసీ
విశ్వాసుల
జీవితాలను చిత్తుచిత్తు చేస్తారే
దోమలనూ వడగట్టీ
ఒంటెలను మ్రింగుతారే
-అయ్యో
వేషధారులారా...
నా దేవుడు నిజమంటూ
నా మతమే గొప్పంటూ
నడివీధిలో
నిలుచుండీ వాదులాడుతుంటారూ
నిజమైన ధర్మాన్ని ధనము
కొరకు హతమార్చి
వంచకులై బోధిస్తూ
కపట భక్తి సలిపారే
-అయ్యో
వేషధారులారా...
మూఢభక్తి బోధనలూ మత
మార్పిడి కార్యాలూ
ఇకనైనా వదిలేసి
నిజం తెలుసుకోరేమీ
నిజమైన ధర్మాన్ని
మీ బ్రతుకులో దాచుకుంటే
సత్యమైన దేవుని
శిక్షనుండి తొలిగేరూ
-అయ్యో
వేషధారులారా...
87. ఓ
మనిషి ఎందుకు పోరాటము
ఓ మనిషి ఎందుకు
పోరాటమూ
నీదికాని లోకముకై
ఆరాటమూ
నిత్యజీవ మార్గమేదో
అన్వేషించూ
సత్యమైన దేవుడినే
ఆరాధించూ
-ఓ
మనిషి...
వేదములు ప్రకటించిన
దేవుడొక్కడే
బైబిలూప్రవచించిన
దేవుడొక్కడే
ఖురాను బోధించిన
దేవుడొక్కడే
సర్వమూ చేసినా
దేవుడొక్కడే
సకలమునూ ఏలుచున్న
దేవుడొక్కడే
-ఓ
మనిషి...
దేవుడెవరొ
తెలియకుండ ప్రాణమొదిలితే
నీ గతి ఏమగునో
యోగించితివా
సత్యవేద గ్రంథములూ
సాక్ష్యమిచ్చెనూ
సర్వశక్తి
సంపన్నుడు దేవుడేననీ
సత్యమును గ్రహించి
బ్రతుకు మార్చుకో
-ఓ
మనిషి...
88. లోకం తీరు చూడరా...
లోకం తీరు చూడరా
సర్వం అంతా మాయరా
ఏ నిమిషంలో ఏమి జరుగునో
ఎవరికి తెలియునురా
ఇది క్షణభంగురమేరా
-లోకం
తీరు...
తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎందరు నీకున్ననూ
సంపాదించిన
ధనధాన్యాలు మెండుగ కలిగున్ననూ
ప్రాణం నిలుపవురా
అవి పరముకు చేర్చవురా
నాటక రంగమురా ఇది
సంతకు మాదిరి రా
-లోకం
తీరు...
లోకములోనా
ఉన్నదంతయూ పాపపు కూపమురా
దేవుని నమ్మి
మారకపోతే బ్రతుకే వ్యర్థమురా
అంతా శూన్యమురా నీ
బ్రతుకే చీకటిరా
సత్యదేవుని
ఎరుగకపోతే నిత్య నరకమురా
బ్రతుకంతా
వ్యర్థమురా
-లోకం
తీరు...
వేదాలన్నీ
బోధించేదీ ఒక్కడే దేవుడనీ
బైబిల్ గ్రంథం
ప్రవచించేదీ దైవం ఒక్కడనీ
ఖురాను శాస్త్రం
ప్రకటించేదీ దేవుడు ఒక్కడనీ
సత్యం తెలిసీ
ఆరాధిస్తే ఇహమున రక్షణరా
ఆ పరమున
స్వాస్థ్యమురా
-లోకం
తీరు...
No comments:
Post a Comment