భారత దేశంలో ఐక్యత ఎలా సాధ్యం?

 

ఐక్యత ఎలా సాధ్యం?



ధార్మిక గ్రంథాలైన
వేదాలు, గీత, బైబిల్, ఖుర్ఆన్ వెలుగులో


ఈ పేజీ చదువుతున్న మీకు కృతజ్ఞతలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ పేజీని చదివి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న “అనైక్యత” మరియు “అనైతికత” అనే రుగ్మతులను పరిష్కరించడానికి ఇది ఒక చిరు ప్రయత్నం.  

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత ప్రగతి, మనిషి జీవన విధానాన్ని మార్చేసింది. ఒకప్పటి పరిస్థులు నేడు లేవు, మనిషి ప్రతి పనిని (Clarity) స్పష్టతతో చేస్తున్నాడు ఆ పని యొక్క లాభ నష్టాలు బేరుజు వెయ్యడం వల్ల శక్తి , డబ్బు తో పాటు సమయాన్ని ఆదా చేయగలుగుతున్నాడు. మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగరగలుగుతున్నాడు నీటిలో చేపలాగా ఈద గలుతున్నాడు. ఇది ఎంతగానో హర్షించదగ్గ విషయం కాని భాదాకర విషయం ఏమిటంటే భూమి మీద మనిషి లాగా జీవించ లేక పోతున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో స్పష్టత (Clarity) గా ఉన్న మనిషి “దేవుడు, ధర్మము” అనే విషయాలలో మాత్రం శాస్త్రీయంగా (Logical) కాక సాంప్రదాయంగా, (Sentimental) గుడ్డిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ రోజు సమాజంలో దేవుడు (GOD) అనే మూడు అక్షరాల పదం మీద కొన్ని కోట్ల రూపాయలు Turn over జరుగుతుంది. అంతేకాక ఈ వ్యామోహంలో మనిషి తన శక్తి, డబ్బు, విలువైన సమయం కోల్పుతున్నాడు. ఎక్కడ చుసిన దేవాలయాలలో భక్తుల రద్దీ పెరిగి పోతుంది, రోజు రోజుకు చర్చిల సంఖ్య పెరుగుతుంది, మసీదులు నిండి పోతున్నాయి, కాని భక్తులలో ఉన్నత విలువలు, మన‌‍‌శాంతి పురుషాద్ధసిద్ది రావటం లేదు. 

అన్ని విషయాలలో కలిసి ఉంటున్న ప్రస్తుత సమాజం దేవుని విషయంలో మాత్రం అనేక వర్గాలుగా చీలిపోయింది. ప్రతి వర్గంలోను ఎన్నో ఉపవర్గాలు, దేవుని పట్ల వివిధ రకాల భావనలు కలిగి ఉన్నారు.

  • ఉదా : హిందు సమాజంలో ఆర్యులు ఏకేశ్వరోపసన చేయలంటే ఇంకొంత మంది దశవతారాలు అని ద్వైత్వం, అద్వైత్వం, విశిష్టాద్వైతం అని పరస్పర విరుద్ధ భావనలు కలిగి ఉన్నారు.

  • అలాగే క్రైస్తవ సమాజంలో యెహోవాయే దేవుడు అని కొంత మంది భావన కలిగి ఉంటే మరి కొంత మంది త్రియేక దేవుడు అనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు తమ ధార్మిక గ్రంథం బైబిల్ అని ప్రకటించుకొనే ప్రతి క్రైస్తవ సంఘం ఇలాంటి పరస్పర విరుద్ధ భావనలు దేవుని పట్ల కలిగి ఉన్నారు.

  • మరి అలాగే ముస్లిం వర్గంలో కొన్ని వర్గాలు అల్లాయే దేవుడు అనే భావన కలిగి ఉంటె మరి కొంత మంది జెండాలు, దర్గాలు, బాబాలను కూడా దేవునిగా భావిస్తున్నారు తమ ధార్మిక గ్రంధం ఖుర్ఆన్ అని ప్రకటించుకునే ప్రతి ముస్లిం వర్గం ఇలాంటి పరస్పర విరుద్ధ భావనలు దేవుని పట్ల కలిగి ఉన్నారు. 

  • ఇంకొంత మంది ఏ విశ్వాసం అయితే ఏమిటి ? అంతా ఒక్కటే గా అని తేలికగా కొట్టి పారేస్తున్నారే గాని దేవుని పట్ల ఖచ్చితమైన/స్పష్టమైన భావన గురించి బుద్దిని గాని ధార్మిక గ్రంథాలు గాని ఉపయోగించటం లేదు.

విచిత్రం ఏమిటంటే ప్రతి సమాజం, ప్రతి సంఘం, ప్రతి వర్గము దేవుని పట్ల తమదే యదార్ధమైన భావన అని ప్రకటించటం ఇతరులది భావన అని ప్రచారం చేయటం వల్లే మత ఘర్షణలు జరగటమే కాక మనుషుల్లో “నైతికత” మరియు “ఐక్యత” అనేవి లోపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో స్పష్టత (Clarity) వేతికే మనం దేవుని విషయంలో నిర్దిష్టమైన భావన కోసం మన బుద్దితో పాటు ధార్మిక గ్రంథాలైన వేదాలు,ఉపనిషత్తులు, గీత, బైబిల్ మరియు ఖుర్ఆన్ ను నిస్పాక్షిక హృదయంతో అన్వేషిద్దాం. అవి ఏదైతే దేవుని పట్ల యదార్ధమైన భావన వ్యక్త పరుస్తాయో అదే భావన మానం కుడా కలిగి ఉందాం! మతానికో దేవుడు, కులానికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, జిల్లాకో దేవుడు, ప్రాంతానికో దేవుడు అనుకున్న కారణంగా రోజు రోజుకు దేవుళ్ళ సంఖ్య పెరిగి పోతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రతి మనిషి నిజదైవాన్ని గుర్తించలేక పోతున్నాడు, అంతే కాక అప్పుడుప్పుడు అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎవరు? అందరికి ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడా! లేక ఒక్కోక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

  • మనం బుద్దితో కాస్త ఆలోచిస్తే తయారు చేసేవాడు లేకుండా ఏ వస్తువు ఉనికిలోకి రాదు కదా! మరి ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇతర గ్రహాలు ఇవన్ని తాయారు చేసేవడెవ్వడు లేకుండానే ఉనికిలోకి ఎలా వచ్చాయింటారు? అలాగే ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే దానిని నడిపించేవాడు ఒక్కడే అయి ఉండాలి. మరి ఈ విశ్వవ్యవస్ధ ఇంత సక్రమంగా నడుస్తుందంటే దీనిని నడిపించేవాడు కుడా ఒక్కడే అయి ఉంటాడు. ఒక వేళ ఆ నడిపించేవాడు ఒక్కడు కాకుండా ఇద్దరు లేక అనేకులు ఉంటే ఒకరు వర్షం కురవాలని శాసిస్తే మరొకరు ఎండ రావాలని ఆజ్ఞపిస్తారు. సూర్యుడు తుర్పు నుంచి ఉదయించాలని ఒకరు Order వేస్తే లేదు పడమర నుండి అని మరోకరు వాదిస్తారు. కాబట్టి ఒక్క దేవుడు కాక అనేక మంది దేవుళ్ళు ఉండి ఉంటే ఈ విశ్వవ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోతుంది. దీనినే మన ధార్మిక గ్రంథాలు కుడా ధృవపరుస్తున్నాయి.


మనందరి దేవుడు ఒక్కడే..!


ద్వావా భూమీ జనయాన్ దేవ ఏక‍ః             ( శ్వేతాశ్వేతర ఉపనిషత్తు : 3 : 3 )

ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు ఒక్కడే.

అహం సర్వస్య ప్రభవో మత్తఃసర్వం ప్రవర్తతే!      ( భగవద్గీత : 10 : 8 )

నేనే సమస్త సృష్టి కి ఉత్పత్తి కారనమైనవాడను, నావలెననే ఈ సమస్తము నడుచుచున్నది.

ఈశ్వరుడు ఒక్కడే! ఆయనకు సమానులుగా చేయడానికి రెండోవాడు గాని, మూడోవాడు గాని, నాల్గోవాడు గాని, లేడు. ఐదోవ, ఆరోవ, ఎడోవ, వాడు లేడు. ఎనిమిదొవ వాడు గాని, తొమ్మిదొవ వాడు గాని, పదోవ వాడు గాని, లేడు. ఆయన ఒక్కడే: ఒకే ఒక్కడై ఉన్నాడు.    ( అధర్వేదం : 13 : 4 : 16,21 )

మన దేవుడైన యెహోవా అద్వితీయుడు.(ద్వితియోపదేసకండము : 6 : 4 )

మరియు భూమి మీద ఎవనికైనను దేవుడు (తండ్రి) అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ దేవుడు (తండ్రి) ఆయన పరలోకమందున్నాడు.        ( మత్తయి : 23 : 9 )

దేవుడు ఒక్కడే.                 ( 1 తిమోతి : 2 : 5 ) 

వాస్తవమేమిటంటే దేవుడు ఒక్కడే, మరోక దేవుడు లేడు.  ( ఖుర్ఆనన్ : 5 : 73 )

మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప వేరొక దేవుడు లేడు.         ( ఖుర్ఆన్ : 2 : 163 )

ఒక వేళ ఆకాశంలో, భూమిలో ఒక్క దేవుడు తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల) రెండింటి వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది.               ( ఖుర్ఆన్ : 21 : 22 )

ఇలా మన ధార్మిక గ్రంధాలన్నీ ఆ దేవుడు ఒక్కడే అని బొదిస్తున్నాయి. ఆ ఒక్క దేవుడినే భగవద్గీత పరిభాషలో సర్వేశ్వరుడు అని, బైబిల్ పరిభాషలో యెహోవా అని, ఖుర్ఆన్ పరిభాషలో అల్లాహ్ అని అన్నారు. భాష మారినంత మాత్రానా ఆ దేవుని అస్తిత్వం మారలేదు. ఎలాగంటే హిందువులు నీరు అన్నా, క్రైస్తవులు వాటర్ (Water) అన్నా, ముస్లింలు పాని అన్నా భావం ఒక్కటే. భాష మారి నంత మాత్రానా నీటి గుణము మారలేదు కదా! దీనినే వేదాల్లో “ఏకం సత్విప్రా బహుధా వదంతి” దేవుడు ఒక్కడే! పండితులు ఆయనను అనేక పేర్లతో పిలుస్తారు, అని అనడం జరిగింది. భగవద్గీత, బైబిల్, మరియు ఖుర్ఆన్ లో వేరు వేరు దేవుళ్ళు లేరు. ఆ ఒక్క దేవుడే అనేక భాషల్లో పరిచయం అయ్యాడు.  
ఇప్పటి వరకు మన బుద్దిమరి ధార్మిక గ్రంధాల ఆధారంగా ఆ దేవుడు ఒక్కడే మరియు ఆయనను అనేక పేర్లతో పిలుస్తారు అనే విషయం స్పష్టమయింది. ఇదే సందేశాన్ని వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాలో, వివిధ భాషల్లో, వివిధ వర్గాల ప్రజలకు అనేక మంది మహనీయులు, ఋషులు, ప్రవక్తలు బోదించారు. వారి యొక్క స్థానం మన హృదయాల్లో ఎలా ఉండాలో మన ధార్మిక గ్రంధాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.


మహనీయులు ఎవరు?

కృష్ణం వందే జగద్గురుమ్ _ శ్రీ కృష్ణుల వారు జగత్తుకు గురువు.  ( భగవద్గీత )

మరియు మీరైతే గురువులు అని పిలవబదవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు.

              ( మత్తయి : 23 : 9,10 )

ప్రవక్త మొహమ్మద్ (స) లో మీకు గొప్ప ఆదర్శం ఉంది. (ఆయన మీకు గురువు).           ( ఖుర్ఆన్ : 33 : 21,) ( హదీస్ )

మహనీయులు ఇచ్చిన సందేశం ఏమిటి?

శ్రీ కృష్ణుల వారు :- “తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత” ఓ అర్జునా! నీవు సర్వ విధముల ఆ సర్వేస్వరునే శరణుబొందుము.        ( భగవద్గీత : 18 : 62 )

యేసు వారు :- “మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.  నివు ని పూర్ణ హృదయంతో ఆయన్నే సేవించవలెను.   (మార్కు : 12 : 29,31 ) 

మొహమ్మద్  వారు :- “ఆ ఒక్క దేవుడినే ఆరాధించండి. సాఫల్యం పొందుతారు.        ( హదీస్ )

సాయిబాబా వారు :- “సబ్ కా మాలిక్ ఏక్ హై”  -  అందరికి దేవుడు ఒక్కడే.              ( శ్రీ సాయిలీలామ్మృతం)   

పై వాఖ్యాల ప్రకారం మనకు తెలిసిన విషయం ఏమిటంటే పై వాఖ్యాల ప్రకారం మనకు తెలిసిన విషయం ఏమిటంటే మహనీయులు అంతా గురువులు అని వారు ఇచ్చిన సందేశం ప్రకారం ఆ పై దేవుడిని ఆరాధించటం.

చివరిగా ఈ పేజీ ద్వారా మనకు స్పష్టమైన విషయాలు ఏమిటంటే మనందరి దేవుడు ఒక్కడే. ఆయన్నే వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇదే సందేశాన్ని మన మహానియులైన శ్రీ కృష్ణుల వారు, యేసు వారు, ప్రవక్త మొహమ్మద్ (స) వారు, మరియు సాయిబాబా వారు గురువుల వలే బోదించారు. ఇది తెలుసుకున్న తరువాత మన కర్తవ్యం ఏమిటంటే ఈ సందేశం ప్రకారం ఆచరిస్తూ, ఇతరులకు కూడా చేరవెయ్యడం మన కర్తవ్యం.


    ఎవరైతే ఆ ఒక్క దేవుడిని ఆరాధిస్తూ, ఇతరులకు కూడా బోదిస్తారో అలాంటి వారికీ “యోగ క్షేమాలు, సిరి సంపదలు, మనశాంతి,  ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. అంతే కాకుండా మన మధ్యలో పరస్పరం ద్వేషాలు పోయి మరియు సోదర భావం తప్పక వస్తుంది.

జైహింద్

No comments:

Post a Comment