సామాజిక రుగ్మతలు –
ధార్మిక గ్రంథాల పరిష్కారం
నేటి సామాజిక పరిస్థితి – ఎక్కడ చూసిన లంచం, వ్యభిచారం,
దొంగతనాలు, హత్యలు, Ragging, Acid దాడులు, AIDS,
ఇవి ఎందుకు జరుగుతున్నాయి?
మనిషి తానూ ఒకరి ఆధీనంలో ఉన్నాడని
మరిచిపోతున్నాడు. ఈ జీవితం ఇక్కడితో అంతం అయిపోతుంది అనుకుంటున్నాడు. కాని దీని
తర్వాత మరొ జీవితం ఉంది అక్కడ మంచి చేసిన వారికి శాశ్వత స్వర్గం చెడు చేసిన వారికి
శాశ్వత నరకం ఉంటూందని గ్రహించలేకపోతున్నాడు.
వాస్తవం ఏమిటి?
మనిషి తన సృష్టికర్త ఆధీనంలో ఉన్నాడు. ఆయన
ప్రజలందరిపై నిఘా పెట్టి ఉంచాడు.
1. చూస్తున్నాడు:
సర్వతః పాణి పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం !
సర్వతః శృతిమల్లోకే సర్వ మావృత్య తిష్ఠతి !! (గీత 13:14)
సర్వతోక్షి: ఆయన మనుషులు చేసే సకల మంచి చెడు
చేష్టలు చూస్తూన్నాడు.
జనులలో పశుప్రాయూలారా! దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా!
మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు? చెవులను కలుగజేసినవాడు వినకుండునా? కంటిని
నిర్మించినావాడు కానకుండునా? (కీర్తనలు 94:8-9)
వహువస్
సమీఉల్ బసీర్. (ఖుర్ ఆన్ 42:11)
ఆయన సమస్తమూ వింటూన్నాడు, సమస్తామూ
చూస్తూన్నాడు.
2. వింటున్నాడు:
సర్వతః శృతిమల్లోకే: ఆయన మనుషులు చెప్పే సకల మంచి చెడు మాటలను వింటున్నాడు.
జనులలో పశుప్రాయూలారా! దీనిని ఆలోచించుడి.
బుద్ధిహీనులారా! మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు? చెవులను కలుగజేసినవాడు
వినకుండునా? కంటిని నిర్మించినావాడు కానకుండునా? (కీర్తనలు 94:8-9)
వహువస్
సమీఉల్ బసీర్. (ఖుర్ ఆన్
42:11)
ఆయన సమస్తమూ వింటూన్నాడు, సమస్తామూ చూస్తూన్నాడు.
3.
సాక్షిగా ఉన్నాడు: గతిర్భర్తా ప్రభు
సాక్షి నివాసః శరణం సృహృత్!
ప్రభవః ప్రళయః స్థానం నిదానం బీజ మవ్యయం!! (గీత 9:18)
పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు,
ప్రాణుల నివాసమును, శరణుమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు,
నిక్షేపమును, నాశరహితమైన బీజమును (మూలకారణమును) నేనే అయియున్నాను.
ప్రభు సాక్షి: విశ్వప్రభువైన
ఆ సర్వేశ్వరుడు ప్రతి మనిషి చేసే ప్రతి పనికి ఆయన స్వతహాగా సాక్షిగా ఉన్నాడు.
అయితే మనమిద్దరం మాట్లాడిన సంగతిని జ్ఞాపకము
చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. (1 సామూయేలు 20:23)
సుమ్మ అల్లాహు షాహీదున్
అలా మా యఫ్‘అలూన్ (ఖుర్ఆన్ 10:46)
మీరు చేస్తున్న ప్రతి పనికి ఆ దేవుడు
సాక్షిగా ఉన్నాడు.
4. హృదయ రహస్యాలు సైతం తెలిసినవాడు:
జోతిష్యమపి తత్ జ్యోతిః తమసః
పరముచ్యతే !
జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది
సర్వస్య విశిష్టితం !! (గీత 13:18)
హృది సర్వస్య
విశిష్టితం: సర్వేశ్వరుడు ప్రతి మనిషి హృదయంలోని
సకల మంచి చెడు ఆలోచనలను సైతం గమనిస్తున్నాడు.
ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాల చొప్పున
ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశీలించువాడను,
అంతరింద్రియములను పరీక్షించువాడను. (యిర్మియా 17:10)
ఇన్నాహు
అలీముమ్ బీజాతిస్ సూదూర్ (ఖుర్ఆన్ 42:24)
ఆయన హృదయలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరిగిన వాడు.
మంచి చేసిన వారికి శాశ్వత స్వర్గం:
సర్వకర్మాణ్యపి సదా కర్వాణో
మద్వ్యపాశ్రయః
మత్ప్రసాదాదవాప్నోతి
శాశ్వతం పదమవ్యయమ్ (గీత 18:56)
సమస్త కర్మములను ఎల్లప్పుడును
చేయుచున్నవాడైనాను కేవలము నన్నే ఆశ్రయించు వాడు (శరణుబొందువాడు) నా అనుగ్రహము వలన
నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు.
వారు
పునరుత్దానములో పాలివారైయుందురు. దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక
వారికను చావ నేరరు. (లూకా 20:36)
ఎవడైతే
అల్లాహ్ ను విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, ఆయన వాని పాపాలను ప్రక్షాళన
చేస్తాడు. ఇంకా సెలయేళ్ళు ప్రవహించే స్వర్గ వనాలలో అతడిని
ప్రవేశింపజేస్తాడు. అతడు శాశ్వతంగా వాటిలోనే ఉంటాడు. ఇదే గొప్ప విజయం. (ఖుర్ఆన్
64:9)
చెడు చేసిన వారికి శాశ్వత నరకం:
నరకే నయతం వాసో భవతి
(గీత
1:44)
శాశ్వత నరక నివాసం కలదు.
అగ్ని ఆరదు పురుగు చావదు.
ఆ దినములలో మనుష్యులు (నరక వాసులు) మరణమును
వెదుకుదురు కాని అది వారికి దొరకనే దొరకదు; చావ వలనని ఆశ పడుదురు గాని మరణము వారి
యొద్ద నుండి పారిపోవును. (ప్రకటన
9:6)
ఇలా ప్రకటించబడుతుంది “ నరక ద్వారాల్లో
ప్రవేశించండి. ఇక్కడ మీరు శాశ్వతంగా ఉండవలసి ఉంది. ఇది గర్విష్టుల
నివాసం. చాలా చెడ్డ నివాసం. (ఖుర్
ఆన్ 39:72)
No comments:
Post a Comment