మానవ జీవిత లక్ష్యం..!

 



మానవుడు --- మనిషి .

జీవితం  ----- పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మధ్య ఉన్న కాలం.

లక్ష్యం ------ చెయ్యవలసిన పని.

 మనిషి తన మేధస్సుతో ఎంతో ఎదిగాడు. నీటిలో చేపలా ఈదగాలుగుతున్నాడు, గాలిలో పక్షిలా ఎగరగాలుగుతున్నాడు. ఇది ఎంతగానో హర్షించదగ్గ విషయం. కాని భూమి మీద మనిషి, మనిషిలా జీవించలేక పోతున్నాడు. కారణం చాలా మంది మనుషులు తమ జీవితానికి అసలు ఏమి లక్ష్యం లేదనుకుని-- తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంకొంత మంది అసలు ఎందుకు బ్రతుకుతున్నామురా దేవుడా!!? అని అనుకుంటూన్నారు. వాస్తావానికి ఈ జీవితానికి అసలు ఏమైనా లక్ష్యం ఉందా? ఉంటే అది ఏమిటి? ఆ లక్ష్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు? అనే విషయాలు ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే ఈ జీవితానికి అర్ధం పరమార్ధం అంటూ ఉంటూంది.

మన చుటూ ఉన్న వస్తువులు అవి దేవుడు తయారు చేసినవి అయినా, లేక మనిషి తయారు చేసినవి అయినా సరే దానికంటూ ఒక లక్ష్యం తప్పక ఉంటూంది. లక్ష్యం లేకుండా మనిషి ఏ వస్తువును తయారు చెయ్యడు. ఉదా: ఒక

సూది ఎందుకంటే బట్టలు కుట్టడానికి అని అంటారు. ఒక Pen ఎందుకు తయారు చేశారంటే వ్రాసుకోవటానికి అని అంటారు. ఒక  Bulb లక్ష్యం ఏమిటంటే వెలుగుని ఇవ్వటం అని అంటారు. అలాగే మనం రోజూ చూసే సూర్యుడు వెలుగును ఇస్తున్నాడు. ఒక తేనేటీగ లక్ష్యం తేనెను ఇవ్వడం. ఒక చెట్టు లక్ష్యం Oxygen ను మరియు నీడను ఇవ్వడం. ఇలా ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక లక్ష్యం తప్పకుండా ఉన్నప్పుడు, సృష్టిరాశుల్లో శ్రేష్టుడైన మనిషికి ఒక లక్ష్యం అంటూ లేదంటారా? తప్పకుండా ఉంటూంది.

ప్రతి వస్తువుకు లక్ష్యాన్ని దానిని తయారు చేసినవాడు మాత్రమే నిర్ణయిస్తాడు. Robotను తయారు చేసిన వాడు అది ఏ విధంగా పని చెయ్యాలో నిర్ణయిస్తాడు కాని Robot తన లక్ష్యన్ని దానికంతట అది పెట్టుకోదు. అలాగే సూర్యుణ్ణి తయారు చేసినవాడు అది తూర్పు నుండి ఉదయించి పడమరకు అస్తమించాలని నిర్ణయించాడు. అది అలాగే చేస్తుంది. అలాగే మనిషి ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, అనే లక్ష్యాన్ని మనిషిని తయారు చేసిన దేవుడే నిర్ణయిస్తాడు. తయారు చేసినవాడు ఆ వస్తువు దాని లక్ష్యం ప్రకారం పని చేస్తుందా లేదా అని గమనిస్తూ ఉంటాడు. ఆ లక్ష్యన్ని నేరవేర్చకపోతే ఆ వస్తువు నిరుపయోగంగా మారిపోతుంది.


No comments:

Post a Comment